రాజీవ్ సాలూరి, యామిని భాస్కర్. పృధ్వీ ప్రధాన పాత్రల్లో కన్నా సినీ ప్రొడక్షన్ పతాకంపై జి.రాజవంశీ దర్శకత్వంలో కె.శ్రీనివాసరావు నిర్మిస్తోన్న చిత్రం 'టైటానిక్'. అంతర్వేది to అమలాపురం అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ఆడియో లాంచ్ ఆదివారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. అనిల్ రావిపూడి బిగ్ సీడీను ఆవిష్కరించగా ఎన్.శంకర్ ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను కె.ఎల్.దామోదర ప్రసాద్ కు అందించారు. ఈ సందర్భంగా..
దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ''సెన్సేషనల్ టైటిల్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆడియో, సినిమా పెద్ద హిట్ కావాలి'' అని చెప్పారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ''నేను కోటి గారితో పని చేయలేకపోయినా... ఆయన పాటను రీమిక్స్ చేస్తున్నాను. ఆయన కుమారుడు నటించిన సినిమాలు చూశాను. బాగా నటిస్తున్నాడు. ఈ సినిమా తనకు పెద్ద హిట్ కావాలి. నిర్మాతలకు లాభాలు రావాలి'' అని చెప్పారు.
ఎన్.శంకర్ మాట్లాడుతూ.. ''ట్రైలర్ లో సినిమా సక్సెస్ కల కనిపిస్తోంది. హిట్ టైటిల్ ను ఈ సినిమాకు పెట్టుకున్నారు. నిర్మాతలు ఎంతో ప్యాషన్ తో సినిమాను నిర్మించారు. వారికి మంచి లాభాలు రావాలి'' అని చెప్పారు.
కోటి మాట్లాడుతూ.. ''టైటానిక్ అనే టైటిల్ ను ధైర్యంగా పెట్టారు. ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో సినిమా ఉంటుంది. ఇంగ్లీష్ టైటానిక్ మూవీను మరిపించే విధంగా ఈ సినిమా ఎంతో కామెడీగా ఉంటుంది. వినోద్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాతో రాజవంశీ కు దర్శకుడిగా మంచి పేరొస్తుంది'' అని చెప్పారు.
దర్శకుడు రాజవంశీ మాట్లాడుతూ.. ''టైటిల్ చెప్పగానే సినిమా చేయడానికి నిర్మాత ఒప్పుకున్నారు. ఎంటర్టైన్మెంట్ ను ఆధారంగా చేసుకొని నడిచే కథ. కుటుంబమంతా కలిసి అంతర్వేది నుండి అమలాపురానికి ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందనేదే సినిమా'' అని చెప్పారు.
రాజీవ్ మాట్లాడుతూ.. ''కుటుంబమంతా కలిసి సరదాగా చూసే సినిమా. మొత్తం నాలుగు పాటలుంటాయి. వినోద్ యాజమాన్య గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు'' అని చెప్పారు.
నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ''ప్రతి ఒక్కరు సినిమా కోసం కష్టపడి పని చేశారు. డైరెక్టర్ చెప్పిన దానికంటే బాగా చిత్రాన్ని రూపొందించాడు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.
వినోద్ యాజమాన్య మాట్లాడుతూ.. ''నాకు సపోర్ట్ చేసిన నా సింగర్స్ కు, అవకాసం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు.
పృథ్వి మాట్లాడుతూ.. ''గోవా రాజు అనే పాత్రలో నటిస్తున్నాను. ఇప్పటికే పోస్టర్స్, ట్రైలర్ ద్వారా ఆ పాత్రకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలి'' అని చెప్పారు.
యామిని భాస్కర్ మాట్లాడుతూ.. ''రాజీవ్ సపోర్టివ్ యాక్టర్. సినిమాలో నాలుగు పాటలుంటాయి. ప్రతి పాట అధ్బుతంగా ఉంటుంది. నాకు ఈ సినిమాలో అవకాసం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్' అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, ఫోటోగ్రఫీ: అమర్.జి, ఆర్ట్: రఘు కులకర్ణి, సహనిర్మాత: సురేష్ బాబు అట్లూరి, నిర్మాత: కె.శ్రీనివాసరావు, రచన-దర్శకత్వం: జి.రాజవంశీ.