Advertisementt

మూడు పాటల మినహా 'తొలికిరణం' షూటింగ్ పూర్తి!

Sat 30th Apr 2016 04:21 PM
tholi kiranam movie,jhon babu,sudhakar,abhinaya  మూడు పాటల మినహా 'తొలికిరణం' షూటింగ్ పూర్తి!
మూడు పాటల మినహా 'తొలికిరణం' షూటింగ్ పూర్తి!
Advertisement
Ads by CJ

సువర్ణ క్రియేషన్స్ పతాకంపై పి.డి.రాజు ప్రధాన పాత్రలో జె.జాన్ బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తున్న సినిమా తొలి కిరణం. ఈ చిత్రం మూడు పాటల మినహా షూటింగ్ పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో

దర్శకుడు జె.జాన్ బాబు మాట్లాడుతూ.. ''ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలనుసహజ సిద్ధంగా చిత్రీకరించేందుకు జెరుషలేము, ఈజిప్టు దేశాలకు వెళ్ళనున్నాం. ఇప్పటివరకు వచ్చిన జీసస్ చిత్రాలలో ఎవరూ.. స్మృశించని కోణాలను ఈ చిత్రం ద్వారా ప్రపంచానికి తెలియబరచబోతున్నాం. ఈ చిత్రానికి క్రైస్తవ సమాజం నుంచే కాక, ఇతర వర్గాల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఆర్.పి.పట్నాయక్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. జూన్ లేదా జూలై మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

నిర్మాత సుధాకర్ మాట్లాడుతూ.. ''సినిమా బాగా వచ్చింది. కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి ఫారెన్ కు వెళ్ళబోతున్నాం. ఆర్.పి గారు అందించిన మ్యూజిక్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది'' అని చెప్పారు.

ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ.. ''కళలకు మతం లేదు. సినిమాకు కూడా మతం లేదు. ఇదొక మనిషి సినిమా. జీసస్ జీవితంలో జరిగిన నలభై రోజుల అధ్బుత ఘట్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో సినిమా ఉంటుంది. చరిత్రలో నిలిచిపోయే పాటలను చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాకు మ్యూజిక్ చేశాను'' అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో పి.డి.రాజు, అభినయ, మౌనిక, జెమిని సురేష్ తదితరులు పాల్గొన్నారు. 

ఈ చిత్రానికి కథ-పాటలు: రెవరెండ్ టి.ఎ. ప్రభుకిరణ్, రచన సహకారం:వి.ఎం.ఎం.ప్రవీణ్, సంగీతం: ఆర్.పి.పట్నాయక్, కెమెరా: మురళీకృష్ణ, ఎడిటింగ్: వినయ్, నిర్మాత: టి.సుధాకర్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జె.జాన్ బాబు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ