Advertisementt

అల్లు శిరీష్ నూతన చిత్రం ప్రారంభం!

Thu 28th Apr 2016 06:25 PM
allu sireesh,sree shailendra productions,reddy  అల్లు శిరీష్ నూతన చిత్రం ప్రారంభం!
అల్లు శిరీష్ నూతన చిత్రం ప్రారంభం!
Advertisement
Ads by CJ

అల్లు శిరీష్ హీరోగా ఎమ్.వి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ నెంబర్ 2 సినిమా గురువారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైంది. ఎస్.శైలేంద్ర బాబు, కె.వి.శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి బోయపాటి శ్రీను క్లాప్ కొట్టగా.. శ్రీనువైట్ల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మారుతి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా డైరెక్టర్ నాకు మంచి స్నేహితుడు. నా సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు. నేను సింగిల్ సిట్టింగ్ లో ఓకే చెప్పిన సినిమా ఇది. సంవత్సరంగా ఇలాంటి కథ కోసమే ఎదురుచూస్తున్నాను. శ్రీరస్తు, శుభమస్తు సినిమా షూటింగ్ తరువాత జూలై మొదటివారంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. యాక్షన్, కామెడీ, పెర్ఫార్మన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్న కథ. కథ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం'' అని చెప్పారు. 

దర్శకుడు ఎమ్.వి.ఎన్.రెడ్డి మాట్లాడుతూ.. ''ఈ సినిమాను లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాం. సినిమాలో పీరియాడిక్ సెటప్ కూడా ఉంటుంది. 700 సంవత్సరాలు క్రితం జరిగే ఫ్లాష్ బ్యాక్ చూపించబోతున్నాం. కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా సినిమా ఉంటుంది'' అని చెప్పారు.

నిర్మాత శైలేంద్ర బాబు మాట్లాడుతూ.. ''తెలుగులో ఇది మా రెండవ చిత్రం. మంచి కథ. సినిమా బాగా వస్తుందనే నమ్మకంతో నిర్మిస్తున్నాం. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

హరీష్ దుగ్గిశెట్టి మాట్లాడుతూ.. ''శిరీష్ కు యాప్ట్ అయ్యే కథ ఇది. ఫుల్ లెంగ్థ్ ఎంటర్టైనర్'' అని చెప్పారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: జిబ్రన్, ఫోటోగ్రఫీ: సంజయ్ లోకనాథ్, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, కో డైరెక్టర్: రాధాకృష్ణ పూసల, నిర్మాతలు: ఎస్.శైలేంద్ర బాబు, కె.వి.శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి, దర్శకుడు: ఎమ్.వి.ఎన్.రెడ్డి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ