Advertisementt

రెడీ ఫర్ రిలీజ్: జీలకర్ర బెల్లం

Tue 26th Apr 2016 04:57 PM
  రెడీ ఫర్ రిలీజ్: జీలకర్ర బెల్లం
రెడీ ఫర్ రిలీజ్: జీలకర్ర బెల్లం
Advertisement
Ads by CJ

అభిజీత్, రేష్మ జంటగా శ్రీ చరణ్ కార్తికేయ మూవీస్ పతాకంపై విజయ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శోభారాణి, నౌరోజీ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'జీలకర్ర బెల్లం'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా..

నిర్మాత నౌరోజీ రెడ్డి మాట్లాడుతూ.. ''రీసెంట్ గా విడుదలయిన ఈ సినిమా ఆడియోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. కామెడీ, క్రైమ్, రొమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి. మంచి సందేశాత్మక చిత్రం. ఈ నెల 29న తెలుగుతో పాటు, కర్నాటకలో కూడా సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

కొమ్మనాపల్లి గణపతిరావు మాట్లాడుతూ .. ''నవలా రచయితగా, సినిమా రచయితగా పాపులర్ అయిన తరువాత సీరియల్స్ తో బిజీ అయిపోయాను. గోవిందా గోవిందా సినిమా తరువాత నేను డైలాగ్స్ రాసిన సినిమా ఇదే. ఇది కొత్త కథ కాదు .. ప్రతి ఇంట్లో జరిగే కథ. కొత్తగా ప్రెజంట్ చేయడానికి ప్రయత్నించాం'' అని చెప్పారు.

అభిజీత్ మాట్లాడుతూ.. ''సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియోలానే సినిమాను కూడా హిట్ చేస్తారని భావిస్తున్నాను. ఏప్రిల్ 29న సినిమా రిలీజ్ అవుతోంది'' అని చెప్పారు.

రేష్మ మాట్లాడుతూ.. ''ఎంటర్టైన్మెంట్ తో పాటు సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంటుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమా. ఈ సినిమాతో నిర్మాతలకు లాభాలు రావాలి'' అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, స్క్రీన్ ప్లే-డైలాగ్స్: కొమ్మనాపల్లి గణపతిరావు, కెమెరా: చిట్టిబాబు, ఆర్ట్: తిరుమలరావు, ఎడిటింగ్: నందమూరి హరి, నిర్మాతలు: శోభారాణి, నౌరోజీ రెడ్డి, దర్శకత్వం: విజయ్ శ్రీనివాస్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ