Advertisementt

గుండమ్మకథ సినిమా ప్లాన్ చేస్తున్నాం:మోహన్ బాబు

Sun 24th Apr 2016 03:45 PM
eedo rakam aado rakam movie,nageshwara reddy,manchu vishnu,raj tarun  గుండమ్మకథ సినిమా ప్లాన్ చేస్తున్నాం:మోహన్ బాబు
గుండమ్మకథ సినిమా ప్లాన్ చేస్తున్నాం:మోహన్ బాబు
Advertisement
Ads by CJ

మంచి విష్ణు, రాజ్ తరుణ్, సోనారిక, హేబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఈడో రకం ఆడో రకం'. జి.నాగేశ్వర రెడ్డి దర్శకుడు, అనిల్ సుంకర నిర్మాత. ఇటీవల విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం శనివారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా..

దర్శకరత్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ''దర్శకుడ్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంత మంచి కాన్సెప్ట్ తీసుకొని సినిమా చేశాడు. హీరోల కోసం కాకుండా కథలు నమ్ముకొని సినిమాలు చేయాలి. మోహన్ బాబు విష్ణు సక్సెస్ చూసి ఎంత సంతోషిస్తాడో.. నేను కూడా అంతే సంతోషపడతాను. విష్ణు, రాజ్ తరుణ్ లు చాలా బాగా నటించారు. ఇద్దరు టీం వర్క్ చేసి నటించారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. సినిమా హిట్స్ అవుతున్నాయని రేట్స్ పెంచేసి నిర్మాతలను ఇబ్బంది పెట్టకూడదు. ఈ జెనరేషన్ హీరోలను ఒక దగ్గరకు చేర్చి నేను వారికి కొన్ని విషయాలను చెప్పాలనుకుంటున్నాను. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ చక్కగా నటించారు. సెకండ్ ఇన్నింగ్స్ లో రాజేంద్రప్రసాద్ లేకుండా సినిమాలు లేవేమో అన్నట్లు పాత్రలను క్రియేట్ చేసుకుంటున్నాడు. పోసానికి పెర్సనల్ గా ఫోన్ చేసి చెప్పను. క్లైమాక్స్ సన్నివేశాల్లో అధ్బుతంగా నటించాడు. రవిబాబు కూడా కామెడీ అధ్బుతంగా చేశాడు. నాకు ఇష్టమైన నిర్మాత అనిల్ సుంకర. చాలా ప్లాన్డ్ గా సినిమాలు చేస్తాడు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకు అవసరం'' అని చెప్పారు.

మోహన్ బాబు మాట్లాడుతూ.. ''ఈ చిత్ర దర్శకుడు నాగేశ్వరరెడ్డి మూడు సినిమాలు చేశాడు. మూడు సినిమాలు మంచి హిట్స్ ఇచ్చాయి. క్రమశిక్షణతో ఉంటే ఏమైనా సాధించొచ్చు. డీ ఒక సూపర్ హిట్ అయితే, దేనికైనా రెడీ దానిని మించిన హిట్ అయింది. ఆ రెండు సినిమాలకు మించిన మరో హిట్ ఈ సినిమాతో లభించింది. నిర్మాత లేకపోతే సినిమా లేదు. అనిల్ సుంకర లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకు ఎంతో అవసరం. ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలని కోరుకుంటున్నాను. రాజ్ తరుణ్ బాగా నటించాడు. విష్ణు మొదట రాజ్ తరుణ్ పేరు చెప్పినప్పుడు నేను అబ్యంతరం చెప్పలేదు. గుండమ్మ కథ సినిమా రైట్స్ ఉంటే తీసుకొని విష్ణు, రాజ్ తరుణ్ ల కాంబినేషన్ లో సినిమా చేస్తాను. దానికి నాగేశ్వరరెడ్డి దర్శకుడు'' అని చెప్పారు. 

నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ''మనం నవ్వుకునే సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. ఈ సినిమా నవ్వించే సినిమా. ఈ సినిమాకు వచ్చిన వారు నవ్వకుండా బయటకు వెళ్ళలేరు. రాజేంద్రప్రసాద్ గారు ఈ సినిమాను భుజాలపై వేసుకొని నడిపించారు. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని, ఇండస్ట్రీకు ఇలాంటి కామెడీ సినిమాలు మరిన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అనిల్ సుంకర గారు గొప్ప నిర్మాత. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.

అనిల్ సుంకర మాట్లాడుతూ.. ''అందరు పోటీ పడి కష్టపడి నటించారు. నాగేశ్వరరెడ్డి గారు రిలీజ్ కు ముందు మీరెలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు సినిమా హిట్ అవుతుంది అని చెప్పేవారు. ఆయన చెప్పినట్లే జరిగింది. విష్ణు రైట్స్ కొని ఈ సినిమాను నా చేతిలో పెట్టాడు. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్'' అని చెప్పారు.

మంచు విష్ణు మాట్లాడుతూ.. ''ఈ సక్సెస్ మా అమ్మా, నాన్నలదే. వారి ఎంకరేజ్మెంట్ లేకపోతే ఈ సినిమా చేసేవాడ్ని కాదు. నాగేశ్వరరెడ్డి గారు నా కెరీర్ లో 'దేనికైనా రెడీ' వంటి మంచి హిట్ సినిమా ఇచ్చారు. ఈ సినిమాతో మరో హిట్ ఇచ్చారు. అనిల్ సుంకర గారి ప్రొడక్షన్ లో చేయడం సొంత ప్రొడక్షన్ హౌస్ లో పని చేసిన ఫీలింగ్ కలిగింది'' అని చెప్పారు.

రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. 'రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి పని చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. షూటింగ్ సమయంలో నాకు ఎంతో హెల్ప్ చేశారు. విష్ణు అన్న సినిమాలో నాతో పాటు రాజ్ రోల్ కూడా సమానంగా ఉండాలని చెప్పారు. ఈ సక్సెస్ మొత్తం విష్ణు అన్నదే. అందులో నేను భాగం అవ్వడం సంతోషంగా ఉంది. నాగేశ్వరరెడ్డి గారు సెట్ లో చాలా కూల్ గా ఉండేవారు. సమ్మర్ లో మంచి హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్'' అని చెప్పారు.

హెబ్బా పటేల్ మాట్లాడుతూ.. ''ఇంత మంచి హిట్ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. సాయి కార్తిక్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ