ఈగ, లెజెండ్ వంటి భారీ బడ్జెట్ సినిమాలను, అటు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ ఊహలు గుసగులాడే, దిక్కులు చూడకు రామయ్యా వంటి మినిమమ్ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ వారాహిచలన చిత్రం. ఈ బ్యానర్ నుండి సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారంటీ హిట్ మూవీ అని భావిస్తారు. ఇలాంటి వారాహి చలనచిత్రం బ్యానర్ పై సాయి శివాని సమర్పణలో విడుదలవుతున్న చిత్రం రాజా చెయ్యి వేస్తే. తొలి చిత్రం బాణం నుండి డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను తెచ్చుకున్న నారా రోహిత్ హీరోగా, హీరోగా సినిమాలు చేస్తూ, అమరావతి అనే చిత్రంలో నెగటివ్ క్యారెక్టర్ లో నటించి అందరి మన్ననలతో పాటు బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్న నందమూరి తారకరత్న మరోసారి ఈ చిత్రంలో విలన్ గా నటిస్తుండటం విశేషం. నందమూరి, నారా కాంబినేషన్ లో సినిమా వస్తుందనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. సినిమా ఫస్ట్ లుక్, థియేట్రికల్ ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చాయి. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్ సంగీత సారథ్యం వహించిన 50వ చిత్రమిది. ఈ సినిమా పాటలను నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణలు విడుదల చేసి సినిమా సక్సెస్ కావాలని యూనిట్ ను అభినందించారు. సాయికార్తీక్ అందించిన పాటలకు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలవనుంది. ఈ డిఫరెంట్ కాంబినేషన్ లో చిత్రాన్ని ప్రదీప్ చిలుకూరి అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు. ట్రైలర్ చూసినవారు నూతన దర్శకుడైననప్పటికీ ప్రదీప్ సినిమాను సూపర్బ్ గా తెరకెక్కించి ఉంటాడని అంటున్నారు. ఈ కాంబినేషన్ పై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్ సీస్ లోనూ మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. యు.ఎస్ లో ఇప్పటి వరకు విడుదలైన నారా రోహిత్ సినిమాల కంటే గ్రాండ్ గా ఈ సినిమా గ్రాండ్ గా విడుదలవుతుంది. ఇటు ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29న సినిమా గ్రాండ్ లెవల్లో విడుదలవుతుంది.