రాజీవ్ సాలూరి, యామిని భాస్కర్. పృధ్వీ ప్రధాన పాత్రల్లో కన్నా సినీ ప్రొడక్షన్ పతాకంపై జి.రాజవంశీ దర్శకత్వంలో కె.శ్రీనివాసరావు నిర్మిస్తోన్న చిత్రం 'టైటానిక్'. అంతర్వేది to అమలాపురం అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ట్రైలర్ ను శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా..
దర్శకుడు రాజవంశీ మాట్లాడుతూ.. ''టైటిల్ విని సినిమా చేయడానికి అంగీకరించిన నిర్మాత శ్రీనివాస్ గారికి థాంక్స్. కథ చెప్పగానే ఆయన ఇంప్రెస్ అయ్యారు. ఎంటర్టైన్మెంట్ ను ఆధారంగా చేసుకొని నడిచే కథ. కుటుంబమంతా కలిసి అంతర్వేది నుండి అమలాపురానికి ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందనేదే సినిమా. వారు ప్రయాణం చేసే లాంచీ పేరే 'టైటానిక్'. త్వరలోనే పాటలు రిలీజ్ చేసి ఏప్రిల్ 30 నాటికి సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని'' చెప్పారు.
నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ''ప్రతి ఒక్కరు సినిమా కోసం కష్టపడి పని చేశారు. డైరెక్టర్ చెప్పిన దానికంటే బాగా చిత్రాన్ని రూపొందించాడు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.
హీరో రాజీవ్ సాలూరి మాట్లాడుతూ.. ''ముప్పై రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ చేశాం. కుటుంబమంతా కలిసి సరదాగా చూసే సినిమా. మొత్తం నాలుగు పాటలుంటాయి. వినోద్ యాజమాన్య గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు'' అని చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య మాట్లాడుతూ.. ''మ్యూజిక్ విషయంలో నాకు ఫ్రీడం ఇచ్చారు. ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ జరుగుతోంది. మంచి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సినిమాలో ఉండే ప్రతి పాట ఒక్కో జోనర్ లో ఉంటుంది'' అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, ఫోటోగ్రఫీ: అమర్.జి, ఆర్ట్: రఘు కులకర్ణి, సహనిర్మాత: సురేష్ బాబు అట్లూరి, నిర్మాత: కె.శ్రీనివాసరావు, రచన-దర్శకత్వం: జి.రాజవంశీ.