యస్.ఆర్.మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్న రెండవ చిత్రం షూటింగ్ రామానాయుడు స్టూడియోలో శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. హీరోపై తీసిన మొదటి సన్నివేశానికి ప్రముఖ నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ క్లాప్‌నివ్వగా, సంతోషం పత్రిక ఎడిటర్, నిర్మాత సురేష్ కొండేటి స్విఛ్చాన్ చేశారు. సీనియర్ దర్శకుడు అక్కినేని వినయ్ కుమార్ గౌరవ దర్శకత్వం నిర్వహించారు. వల్లభనేని సురేష్ చౌదరి నిర్మాణ సారథ్యంలో మాస్టర్ యం.ఠాగూర్, సి.హెచ్.శాంతి స్వరూప్ సమర్పణలో రవికిరణ్ దర్శకత్వలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోగా యోధ, హీరోయిన్‌గా హర్షిత నటిస్తున్నారు. చిత్ర ప్రారంభం సంధర్బంగా జరిగిన మీడియా సమావేశంలో ...
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. మంచి కథతో సరైన ప్రణాళికా బద్దంగా చిత్ర నిర్మాణం జరుపుకొని విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
నిర్మాతలు సి.హెచ్.సత్యనారాయణ, యం.రత్నాకర్ మాట్లాడుతూ..'తొలి సినిమాగా 'ఆమె కోరిక' చేశాము, ఆ చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది' అన్నారు. ఈ చిత్రం లవ్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉంటుంది అన్నారు. 35 రోజులపాటు జరిగే సింగిల్ షెడ్యూల్లో చిత్రం పూర్తవుతుందని తెలిపారు. దర్శకుడు రవి కిరణ్ మాట్లాడుతూ తొలిసారిగా దర్శకత్వం అవకాశం ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను' అన్నారు. వినోదంతో కూడుకున్న ప్రేమ కథాంశాన్ని ఇతివృత్తంగా ఎన్నుకున్నప్పటికీ సామాజిక అంశం కూడా ముడిపడి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే విధంగా కథా కథనం జరుగుతుంది' అన్నారు. ఈ చిత్రంలో ఐదు పాటలు ఉంటాయి. ఈ నెల 27 నుండి పది రోజుల పాటు హైదరాబాద్‌లో, పది రోజులు భీమవరంలో, పది రోజులు వైజాగ్ పరిసరాల్లో, ఐదు రోజులు చెన్నైలో షూటింగ్ జరుగుతుంది' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం తలారి శ్రీనివాస్, ఆర్ట్: నాగు, కెమెరా : ప్రసాద్, మాటు గురుకిరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : నివాస్ గోగుపాటి, నిర్మాతలు : చిక్కా సత్యనారాయణ, మత్తి రత్నాకర్, కథ-స్క్రీన్‌ప్లే - దర్శకత్వం : రవి కిరణ్.