Advertisementt

'సరైనోడు' సమాధానమవుతుంది!

Wed 20th Apr 2016 08:44 PM
sarrainodu movie,allu arjun,boyapati sreenu,allu aravind  'సరైనోడు' సమాధానమవుతుంది!
'సరైనోడు' సమాధానమవుతుంది!
Advertisement
Ads by CJ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ప్రధాన పాత్రల్లో... సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో... సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో... విజయవంతమైన చిత్రాలకు కేరాఆఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'సరైనోడు'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో..

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ''ఈ మధ్యకాలంలో వచ్చిన మోస్ట్ స్టయిలిష్డ్ సినిమా ఇదే అవుతుంది. బాలీవుడ్ కు ధీటుగా ఉన్నత సాంకేతిక విలువలతో కూడిన సినిమాలు తెలుగులో రావట్లేదు అనుకునే వారికి 'సరైనోడు' ఒక సమాధానం అవుతుంది. ప్రతి సినిమాకు హీట్ ఉంటుంది. ఈ సినిమాలో హీట్ బన్నీను మింగేయకుండా.. తనను ఎలివేట్ చేసే విధంగా ఉంటుంది. ఈ సినిమా ఇంత స్టైలిష్ గా రావడానికి కారణం సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీనే. ఈ నెల 22న విడుదల కాబోతున్న ఈ సినిమాను చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను'' అని చెప్పారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ''నేను అందరితో సినిమాలు చేస్తాను. ఏ హీరోకు తగ్గట్లుగా ఎలాంటి కథ సూట్ అవుతుందో ఆలోచించి సినిమా తీస్తాను. ఈ సినిమా కోసం ఒక్క మాట మాత్రమే చెప్పగలను. ఒక పండగ లాంటి సినిమాను ప్రేక్షకులు చూడబోతున్నారు. నాకు సహకరించిన టీం అందరికి రుణపడి ఉంటాను. అరవింద్ లాంటి ప్రొడ్యూసర్ దొరకడం నా అద్రుష్టంగా భావిస్తున్నానని'' చెప్పారు.

తమన్ మాట్లాడుతూ.. ''లక్షన్నర మంది ప్రజల మధ్యన 'సరైనోడు' ఆడియో సక్సెస్ మీట్ జరిగింది. కమర్షియల్ సినిమాలో ఆరు పాటలు సూపర్ హిట్ అవ్వడం మామూలు విషయం కాదు. స్టైలిష్, యాక్షన్ డ్రామా సినిమా చేయడం చాలా కష్టం. కానీ మేము చేశాం. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

ఆది మాట్లాడుతూ.. ''ఓర మాస్ ఓపెనింగ్స్ తో సినిమా రాబోతుంది. బన్నీ సినిమా అంటే తెలుగులో, కేరళలో మంచి క్రేజ్ ఉంటుంది కానీ తమిళనాడులో కూడా ఈ సినిమాకు క్రేజ్ ఏర్పడింది. హార్డ్ వర్క్ చేసే  బోయపాటి శ్రీను, అల్లు అరవింద్, బన్నీల కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది'' అని చెప్పారు.

రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో యాక్షన్ తో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగ్గ సినిమా. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు.

బ్యానర్ - గీతా ఆర్ట్స్, ప్రొడక్షన్ కంట్రోలర్స్ - బాబు, యోగానంద్, చీఫ్ కోఆర్డినేటర్ - కుర్రా రంగారావ్, ఆర్ట్ డైరెక్టర్ - సాయి సురేష్, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావ్, ఫైట్ మాస్టర్స్ - రామ్ లక్ష్మణ్,రవి వర్మ, డిఓపి - రిషి పంజాబి, డైలాగ్స్ - ఎం.రత్నం, మ్యూజిక్ - ఎస్ ఎస్ తమన్, కో ప్రొడ్యూసర్ - శానం నాగ అశోక్ కుమార్, ప్రొడ్యూసర్ - అల్లు అరవింద్, డైరెక్టర్ - బోయపాటి శ్రీను. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ