Advertisementt

'ఛల్ ఛల్ గుఱ్ఱం' పాటలు విడుదల!

Wed 20th Apr 2016 11:15 AM
chal chal gurram,sailej,mohana prasad,ragahvayya  'ఛల్ ఛల్ గుఱ్ఱం' పాటలు విడుదల!
'ఛల్ ఛల్ గుఱ్ఱం' పాటలు విడుదల!
Advertisement
Ads by CJ

శైలేష్, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన పాత్రల్లో ఎం.ఆర్. ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై మోహన ప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య నిర్మిస్తున్న చిత్రం 'ఛల్ ఛల్ గుఱ్ఱం'. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లోని ఆవాస హోటల్ లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో శ్రీకాంత్ బిగ్ సీడీను విడుదల చేయగా.. తమ్మారెడ్డి భరద్వాజ ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను పొన్నాల లక్ష్మయ్యకు అందించారు. ఈ సందర్భంగా..

శ్రీకాంత్ మాటాడుతూ.. ''ముకుంద సినిమాలో వరుణ్ తేజ్ ఫ్రెండ్ గా నటించిన శైలేష్ ను చూసి బాగా నటించాడనుకున్నాను. రీసెంట్ గా తనొక కార్ రేసర్ అని తెలిసింది. సోలో హీరోగా మొదటిసారి నటిస్తోన్న శైలేష్ కు ఈ సినిమాతో పెద్ద సక్సెస్ రావాలి. ట్రైలర్ చూస్తుంటే విజువల్ గా సినిమా బావుందనిపిస్తుంది. వేంగి మ్యూజిక్ కూడా బావుంది'' అని చెప్పారు.

తరుణ్ మాట్లాడుతూ.. ''డైరెక్టర్ గారితో మంచి పరిచయం ఉంది. హీరోగా మొదటిసారైనా.. శైలేష్ బాగా నటించాడు. సినిమా సక్సెస్ కావాలి. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు. 

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ''మోహన్ నాకు మంచి స్నేహితుడు. విజువల్ గా సినిమా గ్రాండియర్ గా ఉంది. సాంగ్స్ కూడా బావున్నాయి. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే కొత్తగా అనిపించింది. వెంగి మంచి మ్యూజిక్ చేశాడు'' అని చెప్పారు.

దర్శకుడు మోహన ప్రసాద్ మాట్లాడుతూ.. ''నన్ను నమ్మి నాతో సినిమా చేయడానికి అంగీకారించిన నిర్మాతకు థాంక్స్. ఇది నా మొదటి సినిమా. చాలా ఎమోషన్స్, వేరియేషన్స్ ఉన్న సినిమా. ఇందులో కొత్త హీరోలు నటించడం చాలా కష్టం కానీ శైలేష్ అవలీలగా నటించాడు. అనుకున్న బడ్జెట్ లో సినిమా చేశాం. ఎమోషనల్ గా సాగే ఈ సినిమా కథకు ఇద్దరు హీరోయిన్స్ వారి గ్లామర్ తో నెక్స్ట్ లెవెల్ కు తీసుకు వెళ్తారు. వెంగి మంచి మ్యూజిక్ ఇచ్చాడు'' అని చెప్పారు.

నిర్మాత రాఘవయ్య మాట్లాడుతూ.. ''సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. సినిమాను, ఆడియోను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ వెంగి మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో మెలోడీ, మాస్, వెస్ట్రన్ బీట్ ఇలా అన్ని రకాల జోనర్స్ పాటలు ఉంటాయి. కసి ఉన్న దర్శకుడు, హీరో కలిసి నా పాటలకు న్యాయం చేశారు. సినిమా మంచి విజయం సాధించాలి'' అని చెప్పారు.

హీరో శైలేష్ మాట్లాడుతూ.. ''వెంగి గారు సాంగ్స్ ఇరగదీసారు. విజువల్ గా సినిమా బావుంటుంది. డైరెక్టర్ గారు నాకు చెప్పిన దానికంటే సినిమా బాగా తీశారు. నిర్మాత రాఘవయ్య గారు మంచి సపోర్ట్ అందించారు'' అని చెప్పారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: వెంగి, ఎడిటింగ్: శంకర్, కెమెరా: శ్యాంప్రసాద్, ఆర్ట్: జె.కె.మూర్తి, ఫైట్స్: రామ్ సుంకర, కోరియోగ్రఫీ: రఘు, ప్రదీప్, నిర్మాత: ఎం.రాఘవయ్య, దర్శకుడు: మోహన ప్రసాద్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ