Advertisementt

రష్మి కొత్త చిత్రం 50 శాతం పూర్తి!

Wed 20th Apr 2016 09:21 AM
rashmi,jhony,gowri krishna,surya,srikrishna creations  రష్మి కొత్త చిత్రం 50 శాతం పూర్తి!
రష్మి కొత్త చిత్రం 50 శాతం పూర్తి!
Advertisement
Ads by CJ

సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో 'కిల్లింగ్‌ వీరప్పన్‌' లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించి, తాజాగా విశాల్‌ నటించిన 'కథకళి' చిత్రాన్ని తెంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో విడుదల చేసిన శ్రీకృష్ణ క్రియేషన్స్‌ అధినేత గౌరీకృష్ణ తాజాగా రష్మి ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు జానిని పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గౌరీకృష్ణ మాట్లాడుతూ... 'జబర్దస్త్‌' యాంకర్‌గా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రష్మి ప్రధాన పాత్రలో ఓ హర్రర్‌ చిత్రంగా రూపొందిస్తున్నాం. ఇప్పటివరకు 50 శాతం షూటింగ్‌ పూర్తయింది. త్వరలో మిగతా పార్ట్‌ పూర్తిచేసి జూన్‌లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్‌ చూశాక సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాం. అన్ని ఏరియాల్లో బిజినెస్‌పరంగా రెస్పాన్స్‌ బాగుంది' అన్నారు.

రష్మి ప్రధాన పాత్రధారిగా సూర్య, మధునందన్‌, బిహెచ్‌ఇఎల్‌ ప్రసాద్‌, సమ్మెట గాంధీ, హర్ష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్‌: వెంకటేష్‌ శృంగవరపు, ఆర్ట్‌:  నాగు, కెమెరా: బాల్‌రెడ్డి, మాటు: చంద మోహన్‌, పిఆర్‌ఓ: వంగా కుమారస్వామి, నిర్మాత: గౌరీకృష్ణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జాని.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ