రాజ్ కృష్ణ, కీర్తన జంటగా అజిత్ క్రియేషన్స్ పతాకంపై టి.కృష్ణవేణమ్మ సమర్పణలో బాలకృష్ణ రెడ్డి దర్శకత్వంలో టి. రాజశేఖరరెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'రుద్ర ఐపిఎస్'. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ప్రతాని రామకృష్ణ గౌడ్, సాగర్ బిగ్ సీడీను రిలీజ్ చేయగా.. సాగర్ ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా..
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ''రాజ్ కృష్ణ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఈ సినిమాతో తనకు మంచి పేరు రావాలి. ఘంటాడి కృష్ణ మ్యూజిక్ బావుంది. తనకు ఈ సినిమాతో పెద్ద విజయం రావాలి. చిన్న సినిమాల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టింది. మినీ థియేటర్స్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ సినిమాకు థియేటర్ల సమస్య రాకుండా చూసుకునే బాధ్యత మాది'' అని చెప్పారు.
సాగర్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాతో అందరికి మంచి పేరు రావాలి. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.
దర్శకుడు బాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. ''రాజకీయ నేపధ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. అవినీతిని, అక్రమాన్ని అరికట్టే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాజ్ కృష్ణ గారు బాగా నటించారు. స్క్రీన్ ప్లే బేస్డ్ చిత్రమిది. ఘంటాడి కృష్ణ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన రాజ్ కృష్ణ గారికి నా థాంక్స్'' అని చెప్పారు.
హీరో రాజ్ కృష్ణ మాట్లాడుతూ.. ''కన్స్ట్రక్షన్ రంగంలో ఉండే నేను సినిమా మీద ఆసక్తితో హీరోగా నటిస్తూ.. నిర్మాతగా మారాను. మంచి కథతో రూపొందుతున్న ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి'' అని చెప్పారు.
ఈ చిత్రానికి ఆర్ట్: విజయకృష్ణ, స్టంట్స్: మార్షల్ రమణ, ఎడిటర్: నందమూరి హరి, సంగీతం: ఘంటాడి కృష్ణ, డిఓపి: వంశీకృష్ణ పి., సమర్పణ: టి.కృష్ణవేణమ్మ, నిర్మాత: టి.రాజశేఖరరెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: బాలకృష్ణ రెడ్డి.