గౌతమ్, ఉదయ్, భవ్యశ్రీ, అంకిత ప్రధాన పాత్రల్లో కృష్ణ మామిడి దర్శకత్వంలో ఏడుకొండలు సమర్పణలో యం.అనురాధ నిర్మిస్తోన్న చిత్రం 'కలి'. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ప్రథాని రామకృష్ణ గౌడ్, సాగర్ కలిసి బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా..
ప్రథాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ''అందరు కొత్తవాళ్ళతో చేస్తోన్న ఈ ప్రయత్నం సక్సెస్ కావాలి. సినిమా రిలీజ్ కు కావాల్సిన సహాయాన్ని తెలంగాణా ఫిలిం ఛాంబర్ తరఫున అందిస్తామని'' తెలిపారు.
దర్శకుడు కృష్ణ మామిడి మాట్లాడుతూ.. ''ఓ ప్రేమికుల జంట, వారాంతంలో ఎంజాయ్ చేయడానికి వెళ్లే రెండు జంటలు, మంచి చెడులను గమనించకుండా అమ్మాయిలతో స్వర్గ సుఖాలు పొందే పోలీస్, పిల్లలు లేకపోయినా ఒకరికి ఒకరు పిల్లలుగా భావించుకునే ఫారెస్ట్ ఆఫీసర్, ఇతర క్యారెక్టర్స్ మధ్య జరిగే ఇతివృత్తమే కలి. మానవుడు తలచిన ప్రతిదీ జరిగితే మరొకరితో పని ఉండదు. కానీ ఎవరైనా సహయం అడిగితే చేయగలిగే స్థితిలో ఉండి సహయం చేయకపోవడం వారి వివేకాన్ని బట్టి ఉంటుంది. మంచి చేయబోతే చెడు ఎదురయ్యే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిచాం'' అని చెప్పారు.
నిర్మాత అనురాధ మాట్లాడుతూ.. ''పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ లేదా మే మొదటివారంలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం. సినిమా బాగా వచ్చింది'' అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: యస్.సత్యానంద్, ఎడిటర్: మహేంద్రనాథ్, పాటల మ్యూజిక్: విజయ్ బొల్ల, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: గిటార్ రమణ, లిరిక్స్: వెంలంకి విజయలక్ష్మి విక్కి, నిర్మాత: యం.అనురాధ, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కృష్ణ మామిడి.