Advertisementt

రాజ్ తరుణ్ టెన్షన్ పోయిందట!

Wed 13th Apr 2016 03:15 PM
eedo rakam aado rakam,vishnu,raj tarun,nageshwara reddy  రాజ్ తరుణ్ టెన్షన్ పోయిందట!
రాజ్ తరుణ్ టెన్షన్ పోయిందట!
Advertisement
Ads by CJ

సినిమా రిలీజ్ కు ముందు చాలా టెన్షన్ పడ్డాను కానీ ప్రివ్యూ షో చూసిన తరువాత ఆ టెన్షన్ మొత్తం పోయిందని హీరో రాజ్ తరుణ్ తను నటించిన 'ఈడో రకం.. ఆడో రకం' సినిమా గుమ్మడికాయ ఫంక్షన్ లో చెప్పారు. మంచి విష్ణు, రాజ్ తరుణ్, సొనారిక, హేబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'ఈడో రకం ఆడో రకం'. జి.నాగేశ్వర రెడ్డి దర్శకుడు, అనిల్ సుంకర నిర్మాత. ఈ సినిమా గుమ్మడికాయ ఫంక్షన్ మంగళవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ''రీసెంట్ గా ఈ సినిమా ప్రివ్యూ షో విష్ణు ఫ్యామిలీతో కలిసి చూశాను. సినిమా చూస్తున్నంతసేపు అందరూ నవ్వుతూనే ఉన్నారు. ఇప్పడు సినిమా గురించి ఇంకేం మాట్లాడను. సినిమా రిలీజ్ అయిన తరువాత మా సినిమా మాట్లాడుతుందని'' అన్నారు.

''గతంలో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరావు అలానే శోభన్ బాబు, కృష్ణ లు కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేసేవారు. ఈ మధ్యకాలంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే మల్టీస్టారర్ సినిమా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ విష్ణు, రాజ్ తరుణ్ ల కాంబినేషన్ లో మరో మల్టీస్టారర్ రాబోతుంది. ఈ సినిమాను మంచి మల్టీస్టారర్ ఎంటర్టైనర్ గా రూపొందించాం. నిర్మాతలు చాలా ఫ్రీడం ఇచ్చారు. రాజేంద్రప్రసాద్ గారు ఈ సినిమాకు మూల స్థంభం'' అని దర్శకుడు నాగేశ్వరరెడ్డి అన్నారు.

''ఈ మల్టీస్టారర్ సినిమా చేయడానికి ఒప్పుకున్న ఇద్దరు హీరోలకు థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. నాగేశ్వరరెడ్డిగారు ప్రతి ఫ్రేమ్ ను ఎంటర్ టైనింగ్ తెరకెక్కించారు. సాయి కార్తిక్ మ్యూజిక్ శ్రోతలను అలరిస్తోంది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అని నిర్మాత అనిల్ సుంకర అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో హెబ్బా పటేల్, సొనారిక తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ