Advertisementt

టర్కీలో చైతు పాటేసుకుంటున్నాడు!

Tue 12th Apr 2016 09:16 PM
sahasam swasaga sagipo,gowtham menon,naga chaitanya  టర్కీలో చైతు పాటేసుకుంటున్నాడు!
టర్కీలో చైతు పాటేసుకుంటున్నాడు!
Advertisement
Ads by CJ

యువసామ్రాట్‌ నాగచైతన్య, డీసెంట్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'ఏమాయ చేసావే' చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఈ హిట్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. ప్రముఖ రచయిత కోన వెంకట్‌ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ విన్నర్‌ ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. 'ఏమాయ చేసావే' చిత్రం ద్వారా సమంతను హీరోయిన్‌గా పరిచయం చేసిన గౌతమ్‌ మీనన్‌ 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం ద్వారా మంజిమ మోహన్‌ను హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలోని ఒక రొమాంటిక్‌ సాంగ్‌ను ఇటీవల టర్కీలో 5 రోజులపాటు చిత్రీకరించారు. ఏప్రిల్‌ 16 నుంచి 20 వరకు క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతుంది. దీంతో టోటల్‌గా షూటింగ్‌ కంప్లీట్‌ అవుతుంది. ఏప్రిల్‌ చివరి వారంలో ఆడియోను, మే చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు, రచయిత కోన వెంకట్‌ మాట్లాడుతూ - ''నాగచైతన్య, గౌతమ్‌ మీనన్‌, ఎ.ఆర్‌.రెహమాన్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'ఏమాయ చేసావే' మ్యూజికల్‌గా సెన్సేషనల్‌ హిట్‌ అయింది. మళ్ళీ వీరి కాంబినేషన్‌లో వస్తున్న 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం కూడా ఆడియోపరంగా మంచి పేరు తెచ్చుకుంటుంది. ఇటీవల యూ ట్యూబ్‌లో విడుదల చేసిన 'ఎల్లిపోమాకే.. ఎదనే వదిలి పోమాకే...' అనే పాట 30 లక్షల వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోంది'' అన్నారు.

యువసామ్రాట్‌ నాగచైతన్య మాట్లాడుతూ - ''ఏమాయ చేశావే చిత్రం నాకు రొమాంటిక్‌ హీరోగా గుర్తింపునిచ్చింది. 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం కూడా ఫస్ట్‌ హాఫ్‌ రొమాంటిక్‌గా వుంటుంది. సెకండాఫ్‌ యాక్షన్‌ కంటెంట్‌తో ప్రేక్షకులందరికీ ఒక స్పెషల్‌ ట్రీట్‌ ఇచ్చేలా రూపొందింది. ఈ చిత్రంలో నా క్యారెక్టర్‌కి ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతారు. గౌతమ్‌ మీనన్‌గారి కాంబినేషన్‌లో మరో పొయెటిక్‌ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది. 'ఏమాయ చేసావే' చిత్రానికి బ్యూటిఫుల్‌ మ్యూజిక్‌ని అందించిన ఎ.ఆర్‌.రెహమాన్‌గారితో ఇది రెండో చిత్రం. ఈ చిత్రానికి కూడా ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ చేశారు. పాటలన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి'' అన్నారు. 

నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ - ''యూ ట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్‌ వచ్చిన 'ఎల్లిపోమాకే.. ఎదనే వదిలి పోమాకే...' పాటను ఇటీవల టర్కీలోని అందమైన లొకేషన్స్‌లో 5 రోజుల పాటు చిత్రీకరించడం జరిగింది. ఏప్రిల్‌ 16 నుంచి 20 వరకు ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్‌ను షూట్‌ జరుగుతుంది. దీంతో టోటల్‌గా చిత్రం షూటింగ్‌ కంప్లీట్‌ అవుతుంది. ఏప్రిల్‌ చివరి వారంలో ఆడియో రిలీజ్‌ చేసి, మే చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు. 

దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ మాట్లాడుతూ - ''ఏమాయ చేసావే' చిత్రం తర్వాత నాగచైతన్యతో చేస్తున్న డిఫరెంట్‌ మూవీ ఇది. ఈ చిత్రంలో నాగచైతన్య లుక్‌ చాలా డిఫరెంట్‌గా వుంటుంది. నాగచైతన్య ఎక్స్‌లెంట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఈ చిత్రంలో చూస్తారు. రెహమాన్‌గారు ఈ చిత్రం కోసం అద్భుతమైన పాటల్ని చేశారు. మా ముగ్గురి కాంబినేషన్‌లో ఇది మరో మ్యూజికల్‌ హిట్‌ మూవీ అవుతుంది'' అన్నారు. 

యువసామ్రాట్‌ నాగచైతన్య, మంజిమ మోహన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ: డాన్‌మాక్‌ ఆర్థర్‌, ఎడిటింగ్‌: ఆంటోని, ఆర్ట్‌: రాజీవన్‌, ఫైట్స్‌: సిల్వ, రచన, సమర్పణ: కోన వెంకట్‌, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ మీనన్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ