Advertisementt

సూర్య తప్ప మరెవరు నటించలేరట!

Tue 12th Apr 2016 04:29 PM
surya 24 movie,audio launch,samantha,vikram k kumar  సూర్య తప్ప మరెవరు నటించలేరట!
సూర్య తప్ప మరెవరు నటించలేరట!
Advertisement
Ads by CJ

వైవిధ్యమైన పాత్రలతో కలెక్షన్ల సునామీ సృష్టించే హీరో సూర్య, సామాన్యుడి ఆలోచనలకు అందకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రాల్ని తెరకెక్కించే స్టామినా ఉన్న విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో రూపొందించిన ప్రెస్టీజియస్ సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ '24'. గ్లోబర్ సినిమాస్, 2డి ఎంటర్ టైన్ మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ కలయికలో స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్ రాజా సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్ర పాటల్ని సోమవారం హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో విడుదల చేశారు. హీరో కార్తి బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను సురేష్ బాబు, బివిఎస్ఎన్ ప్రసాద్ లకు అందించారు. అక్కినేని అఖిల్ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా..

సూర్య మాట్లాడుతూ.. ''నా కెరీర్ లో ఇది చాలా ముఖ్యమైన సినిమా. విక్రమ్ ను కలిసినప్పుడు నాలుగున్నర గంటలు స్టోరీను నేరేట్ చేశాడు. కథ విన్న తరువాత క్లాప్ చేశాను. నేను ఈ సినిమాకు సపోర్ట్ చేయాలని ప్రొడక్షన్ లో భాగమయ్యాను. రెహ్మాన్ గారికి ఎన్ని కమిట్మెంట్స్ ఉన్న మా కోసం సినిమా ఒప్పుకున్నారు. నిత్య, సమంతలకు థాంక్స్'' అని చెప్పారు.

''ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ నా అభినందనలు. ఈ సినిమాకు మ్యూజిక్ చేసే ఛాన్స్ ఇచ్చిన సూర్య, విక్రమ్ లకు థాంక్స్'' అని సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ అన్నారు.

''సూర్య గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. రెహ్మాన్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం హానర్ గా ఫీల్ అవుతున్నాను. గొప్ప మనిషి. భవిష్యత్తులో కూడా ఆయనతో కలిసి పని చేయాలనుకుంటున్నాను. సమంత చాలా బాగా నటించింది. నిత్య కొన్ని కారణాల వలన ఇక్కడకు రాలేకపోయింది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని దర్శకుడు విక్రమ్ కె కుమార్ అన్నారు.

''ఊపిరి సినిమాకు అందరూ ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది. నా పెయింటింగ్ లానే ఈ సినిమాను కూడా మాస్టర్ పీస్ చేస్తారనుకుంటున్నాను. 24 అనేది బ్రిలియంట్ టైటిల్. విక్రమ్ కి టైం అంటే చాలా ఇష్టం. అందుకే అలాంటి టైటిల్ పెట్టాడు. ఫాంటసీగా ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసి మనల్ని తీసుకువెళ్లబోతున్నారు. మంచి స్క్రిప్ట్. అన్నయ్య హీరోగా, విలన్ గానే కాకుండా మరొక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. సాంగ్స్ అన్నీ చాలా బావున్నాయి. సమంత చాలా అందంగా కనిపిస్తుంది. నిర్మాతలకు ఆల్ ది బెస్ట్'' అని కార్తి అన్నారు.

అఖిల్ మాట్లాడుతూ.. ''గజిని సినిమా చూసినప్పుడు సూర్య గారిని చూసి నటుడు అంటే ఇలా ఉండాలనుకున్నాను. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నారాయన. నటుడిగా సూర్య గారి నుండి చాలా నేర్చుకోవాలి. సమంత నా ఫేవరేట్ హీరోయిన్. విక్రమ్ జీనియస్ డైరెక్టర్. రెహ్మాన్ గారు అధ్బుతమైన సంగీత దర్శకుడు. వీరందరి కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలి'' అని చెప్పారు.

''ఇది నా డ్రీం ప్రాజెక్ట్. నా మొదటి సినిమాకు రెహ్మాన్ గారే మ్యూజిక్ అందించారు. ఆయనే నాకు మంచి లైఫ్ ఇచ్చారు. మరోసారి కలిసి వర్క్ చేయడం సంతోషంగా ఉంది. తన మ్యూజిక్ తో ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళారు. విక్రమ్ గారు నాకు ఈ సినిమా కథ చెప్పినప్పుడు భయపడ్డాను. ఇలా ఒక సినిమా చెయొచ్చా అనిపించింది. కాని విక్రమ్ చెప్పినదానికంటే బాగా తీశారు. సూర్య గారు మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తారు. ఈ సినిమాను సూర్య గారు మాత్రమే చేయగలరని'' హీరోయిన్ సమంత అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫి: కె.తిరునాపుక్కరసు, ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, ప్రొడక్షన్ డిజైన్ - అమిత్ రే మరియు సుభ్రదా చక్రబోర్తి, పాటలు - చంద్రబోస్ మరియు శశాంక్ వెన్నెలకంటి, సౌండ్ డిజైన్ - లక్ష్మీ నారాయణన్, సౌండ్ ఎఫెక్ట్స్ - ఇక్బాల్, యాక్షన్ - అన్బరివ్, కొరియోగ్రఫీ - రాజు సుందరం, బృంద, దినేష్, శ్రీధర్, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ - జులియన్ ట్రౌసెల్లియర్, మేకప్ - క్లోవర్ వూటాన్ మరియు ప్రీతి షీల్.జి.సింగ్, కాస్ట్యూమ్ డిజైన్- దర్శన్ జలన్, ఇషా-దివ్య మరియు నిధి-అనిషా, స్టిల్స్ - ఆర్.వెంకట్రామ్, పబ్లిసిటీ డిజైన్ - రైసింగ్ ఆపిల్, రెడ్ డాట్, పి.ఆర్.ఓ - ఎస్ కె ఎన్ మరియు ఏలూరు శ్రీను, నిర్మాత: సూర్య, రచన-దర్శకత్వం-విక్రం కె కుమార్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ