Advertisementt

అక్కినేని అభిమానుల కోసం..!

Mon 11th Apr 2016 06:16 PM
telugu movie oopiri,nagarjuna latest movie oopiri,nagarjuna and karthi movie oopiri,telugu movie oopiri review,oopiri review in cinejosh,oopiri cinejosh review,oopiri director vamsy paidipally,oopiri producer pvp  అక్కినేని అభిమానుల కోసం..!
అక్కినేని అభిమానుల కోసం..!
Advertisement
Ads by CJ
కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మించిన భారీ మల్టీస్టారర్‌ ఊపిరి. తెలుగు, తమిళ భాషల్లో మార్చి 25ప విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. యు.వెస్‌లో ఊపిరి స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతూ రెండు మిలియ‌న్ డాల‌ర్స్ క‌లెక్ష‌న్స్ కు ద‌గ్గ‌ర‌వుతుంది. 
ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్‌ వి. పొట్లూరి మాట్లాడుతూ - మా ఊపిరి చిత్రానికి యునానిమస్‌గా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అనే టాక్‌ వచ్చింది. ఈమధ్యకాలంలో వచ్చిన కొన్ని సూపర్‌హిట్‌ చిత్రాల్లో ఊపిరి కూడా ఒకటి కావడం ఆనందంగా వుంది. మనం, సోగ్గాడే చిన్నినాయ‌నా వంటి వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్స్ త‌ర్వాత నాగార్జునగారికి హ్యాట్రిక్‌ చిత్రంగా నిలిచిన ఊపిరి ఈ సమ్మర్‌లో అత్యధికంగా కలెక్ట్‌ చేసే చిత్రం కాబోతోంది. ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. యు.ఎస్‌లో రెండు మిలియ‌న్స్ డాల‌ర్స్ క‌లెక్ష‌న్స్ కు ద‌గ్గ‌ర‌వుతుంది.  ఇలాంటి హ్య‌ట్రిక్ స‌క్సెస్‌ల‌తో నాగార్జున‌గారు చాల హ్య‌పీగా ఉన్నారు. ఇంత‌టి ఘ‌న‌విజ‌యాన్ని అందించిన అక్కినేని అభిమానుల‌కు, తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ 13న హైద‌రాబాద్ శిల్ప‌క‌ళావేదిక‌లో అశేష అక్కినేని అభిమానుల స‌మ‌క్షంలో ఊపిరి థాంక్స్ మీట్‌ను నిర్వ‌హిస్తున్నాం అన్నారు. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ