ప్రదీప్, ధీరేంద్ర, కిరణ్, సాయి తేజ, అంబేద్కర్, మమత ప్రధాన పాత్రల్లో తారా-నీలు కో ఆపరేషన్స్ బ్యానర్ పై యం.ఎస్.బాబు దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం 'మంత్రం తంత్రం యంత్రం'. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక శనివారం హైదరాబాద్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకరత్న దాసరి నారాయణరావు క్లాప్ కొట్టగా.. వరంగల్ ఎం.పి దయాకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. చంద్రబోసు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..
యం.ఎస్.బాబు మాట్లాడుతూ.. ''పాటల రచయితగా కెరీర్ ప్రారంభించిన నేను ఈరోజు మంచి స్థాయిలో ఉండడానికి దాసరి గారే కారణం. గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ సినిమా తరువాత చేస్తున్న మరో చిత్రమిది. హారర్, థ్రిల్లర్, సస్పెన్స్, కామెడీ ఇలా అన్ని అంశాలు ఉండే సినిమా. సబ్జెక్టుపై బాగా రీసెర్చ్ చేసామని, ఈ నెల 25వ తేదీ నుండి వరంగల్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించి.. సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేస్తామని'' తెలిపారు.
''స్టేజ్ ఆర్టిస్ట్ గా నేను నటించిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ను చూసి ఈ సినిమాలో నటించే అవకాశమిచ్చిన దర్శకుడికి థాంక్స్'' అని హీరో అంబేద్కర్ అన్నారు.
''కన్నడలో చాలా చిత్రాల్లో నటించాను. తెలుగులో పంచముఖి, కాలింగ్ బెల్ వంటి చిత్రాల్లో నటించాను. ఈ సినిమా ద్వారా తెలుగులో మరో అవకాశం వచ్చింది. ఇదొక లేడీ ఓరియెంటెడ్ సినిమా అని చెప్పొచ్చు. నటనకు ప్రాధాన్యం ఉంటుంది. అందరికి మంచి పేరు తెస్తుందని నమ్ముతున్నానని'' హీరోయిన్ మమత అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ప్రదీప్, ధీరేంద్ర, కిరణ్, సాయి తేజ, రవీందర్ పాల్గొనని సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ:గిరి దోసాడ, ఎడిటింగ్: ఉపేంద్ర, కోరియోగ్రఫీ: వేణు పాల్, కో డైరెక్టర్: సత్య నారాయణ, కథ: మహేశ్వర్, సహకారం: రమేష్ గౌడ్, సహా నిర్మాతలు: అంబాల రవి, మోతే ప్రకాష్ రెడ్డి, ఎన్.అప్సర, ఎస్.కె.మఖ్భూల్, సమర్పణ: అర్మాన్, దర్శకత్వం-నిర్మాత-సంగీతం: యం.ఎస్.బాబు.