Advertisementt

'ముసుగు' రిలీజ్ కు రెడీ అవుతోంది!

Sat 09th Apr 2016 01:37 PM
musugu movie,daggubati varun,sreekar babu,trinath  'ముసుగు' రిలీజ్ కు రెడీ అవుతోంది!
'ముసుగు' రిలీజ్ కు రెడీ అవుతోంది!
Advertisement
Ads by CJ

త్రినాథ్ పంపన, మనోజ్ కృష్ణ, హర్ష కృష్ణమూర్తి, జెస్సీ, పూజశ్రీ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'ముసుగు'. శ్రీకరబాబు దర్శకత్వం వహిస్తున్నారు. వేద ఎంటర్ ప్రైజెస్ పతాకంపై దగ్గుబాటి వరుణ్ నిర్మిస్తున్నారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.ఈ సందర్భంగా..

నిర్మాత దగ్గుబాటి వరుణ్ మాట్లాడుతూ.. ''మా బ్యానర్ లో వస్తున్న తొలి చిత్రమిది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నాం. ఇటీవల గోవాలో చేసిన చివరి షెడ్యూల్ చేశాం. నిర్మాణానంతర కార్యక్రమాలు, సెన్సార్ పూర్తయింది. 'ఎ సర్టిఫికేట్ వచ్చింది. ఏప్రిల్ 14 న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.

''భార్య భర్తల ఇల్లీగల్ ఎఫైర్స్ నేపధ్యంలో సాగే చిత్రమిది. చదరంగంలో ఎత్తుకు పై ఎత్తులు ఎలా ఉంటాయో.. ఈ సినిమా కూడా అంతే ఎత్తులతో ఆద్యంతం ఆసక్తిగా నడుస్తుంది. అవుట్ పుట్ బాగా వచ్చింది. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా సినిమా లావిష్ గా వచ్చేందుకు ఎంతో సహకరించారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని'' దర్శకుడు శ్రీకరబాబు చెప్పారు.

ఈ చిత్రానికి మాటలు,పాటలు: గంగోత్రి విశ్వనాథ్, ఎడిటింగ్: అనిల్ బొంతు, సంగీతం: నవనీత్ చారి, సి.ఎన్.ఆదిత్య, స్క్రీన్ ప్లే: దివాకర్ బాబు, కెమెరా- దర్శకత్వం: శ్రీకరబాబు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ