Advertisementt

'నేను నా బాయ్ ఫ్రెండ్స్' సినిమా ప్రారంభం!

Fri 08th Apr 2016 06:26 PM
nenu na boy friends,hebah patel,punarnavi,bhaskar bandi  'నేను నా బాయ్ ఫ్రెండ్స్' సినిమా ప్రారంభం!
'నేను నా బాయ్ ఫ్రెండ్స్' సినిమా ప్రారంభం!
Advertisement
Ads by CJ

కుమారి 21 ఎఫ్ సినిమా తరువాత మరో మంచి పాత్రలో నటించే అవకాశం 'నేను నా బాయ్ ఫ్రెండ్స్' సినిమాతో వచ్చిందంటూ హీరోయిన్ హెబ్బా పటేల్ చెబుతోంది. హెబ్బా పటేల్, పునర్నవి, నోయెల్, పార్వతీశం ప్రధాన పాత్రల్లో భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. ముహుర్తపు సన్నివేశానికి దాసరి నారాయణరావు క్లాప్ కొట్టగా.. దిల్ రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. డి.సురేష్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

దర్శకుడు బండి భాస్కర్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాను. వినాయక్ గారి దగ్గర పని నేర్చుకున్నాను. ఇప్పటికే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా సినిమాను రూపొందిస్తున్నామని'' తెలిపారు.

''ఉగాది రోజున మా బ్యానర్ లో కొత్త సినిమాను ప్రారంభించడం సంతోషంగా ఉంది. 'సినిమా చూపిస్త మావ' సినిమా తరువాత చాలా కథలు విన్నాను. భాస్కర్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో సినిమా చేయడానికి ఓకే చెప్పానని'' నిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్నారు. 

''మ్యూజిక్ కు మంచి స్కోప్ ఉన్న సినిమా. ఈ బ్యానర్ లో ఇది నా మూడవ చిత్రమని'' మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర చెప్పారు.

ఈ చిత్రానికి కథ: లక్కీ మీడియా, మాటలు: నంద్యాల రవి, కెమెరా: విశ్వ డి.బి, ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్, సంగీతం: శేఖర్ చంద్ర, సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్, రచన: సాయికృష్ణ, ఆర్ట్: ఎస్.రామకృష్ణ మోనిక నిగోత్రే, అసోసియేట్ ప్రొడ్యూసర్: గంజి రమేష్ కుమార్, ప్రొడ్యూసర్: బెక్కం వేణుగోపాల్(గోపి), స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భాస్కర్ బండి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ