Advertisementt

నిర్మాణాంతర కార్యక్రమాలలో వర్మ vs శర్మ!

Thu 07th Apr 2016 10:40 PM
varma verses sharma,post production work,bhuvan vijay  నిర్మాణాంతర కార్యక్రమాలలో వర్మ vs శర్మ!
నిర్మాణాంతర కార్యక్రమాలలో వర్మ vs శర్మ!
Advertisement
Ads by CJ

మాస్టర్ చంద్రాంషువు నార్ని సమర్పణలో పాలిన్ డ్రోమ్ పిక్చర్స్ పతాకం పై  గిరిబాబు, జూ.రేలంగి టైటిల్ రోల్ లో బాబ్ రతన్, బిందు బార్బీ జంటగా నటిస్తున్న చిత్రం 'వర్మ vs శర్మ'. ఇటీవలే చివరి షెడ్యూల్ పూర్తిచేసుకుని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఉగాది  సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. 

దర్శకుడు భువన విజయ్ మాట్లాడుతూ... ''ఈ చిత్రం పూర్తిగా గోదావరి జిల్లాలలో ఆహ్లాదకర లొకేషన్స్ లో  షూటింగ్ జరుపుకుందని.. హాస్య ప్రధానంగా మూఢ నమ్మకాలపై రూపొందిన ఈ చిత్రం గోపాలా..గోపాల,  పీకె,  తరహాలో కామెడీ సెటైర్ గా ఉంటుందని'' అన్నారు. 

వర్మ పాత్రలో గిరిబాబు, శర్మ పాత్రలో రేలంగి తగినంత హాస్యాన్ని పండించారని.. హీరో తాను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ప్రయత్నించిన విధానం అందరినీ నవ్విస్తూనే, చివర్లో థ్రిల్ గురి చేస్తుందని అన్నారు. రమణ రాథోడ్ సంగీతం ఈ చిత్రాన్ని మరో మెట్టుకు తీసుకెళ్తుందని తెలిపారు. 

నిర్మాత ఫణి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ... ''ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని..ఈ చిత్రం నుండి 100% హ్యూమర్ ఆశించవచ్చని, త్వరలో ఆడియో విడుదల చేస్తామని'' తెలిపారు.

దీక్షితులు,రమణ,అడ్డకర్ల,బాబులు,ఉదయబాబు,తిరుపతి రావు,అజయ్, శ్రీరామ్,వాసు,బుల్లబ్బాయి, భారతి, లలిత, లక్ష్మి తదితరులు నటించిన  ఈ చిత్రానికి  సంగీతం:రమణ రాథోడ్,  కెమెరా: రంగా, ఎడిటింగ్: ప్రభు, పాటలు: రమణ, కొరియోగ్రఫీ: ఆనంద్, ఆర్ట్: హరి, నిర్మాత: ఫణి దుర్గ ప్రసాద్(చినబాబు) నార్ని, రచన-దర్శకత్వం: భువన విజయ్

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ