ఉగాది పర్వదినం సందర్బంగా విక్టరీ వెంకటేష్, నయనతార, మారుతి చిత్రం మెదటి లుక్
దృశ్యం, గోపాలగోపాల లాంటి విభిన్న కథా చిత్రాలతో విజయాలు అందుకున్న విక్టరి వెంకటేష్ హీరోగా, నయనతార హీరోయిన్ గా, సెన్సేషనల్ డైరక్టర్ మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్ లో, సూర్యదేవర నాగ వంశి, పిడివి ప్రసాద్ నిర్మాతలుగా, ప్రముఖ నిర్మాత ఎస్.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణలో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం యెక్క మెదటి లుక్ ని ఉగాది పర్వదినం సందర్భంగా విడుదల చేయనున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రం జులై లో విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... ''వెంకటేష్ గారు హీరోగా మారుతి గారి దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నాము. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన నయనతార మూడవసారి నటిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన లక్ష్మి, తులసి చిత్రాలు ఘనవిజయం సాదించిన విషయం తెలిసిందే. ఈచిత్రం కూడా ఆదే తరహాలో ఘన విజయం సాధిస్తుందనటంలో సందేహం లేదు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. దీనికి సంభందించిన మెదటిలుక్ ని ఉగాది పర్వదిన శుభసందర్బంలో విడుదల చేస్తున్నాము. ఉత్తమ విలన్, చీకటి రాజ్యం వంటి విభిన్నమైన చిత్రాలకు సంగీతాన్ని సమకూర్సిన జిబ్రాన్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నారు. అన్ని సాంగ్స్ చాలా చక్కగా ఇచ్చారు. వినగానే హమ్ చేసుకునేలా వుంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే విధంగా ఈ చిత్రాన్ని మారుతి తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్ గారి కామెడి టైమింగ్స్ ని మైండ్ లో పెట్టుకుని మారుతి డైలాగ్స్ రాసారు. ఈ చిత్రాన్ని జులై లో విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నాము'' అని అన్నారు.
బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, పృధ్వి, మురళీశర్మ, దేవ్ గిల్, జయప్రకాష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: SB.ఉద్దవ్, కళ: రమణ వంక, చాయాగ్రహణం: రిచర్డ్ ప్రసాద్, సంగీతం: జిబ్రాన్, సమర్పణ: ఎస్.రాధాకృష్ణ, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, పిడివి ప్రసాద్, రచన-దర్శకత్వం: మారుతి.