ప్రస్తుతం ఉన్న యువతకు తగ్గట్లుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకుడు నాని ఆచార్య తెలిపారు. కార్తీక్, భాను జంటగా యస్.ఆర్.పి.విజువల్స్ బ్యానర్ పై నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్ పాటిల్ నిర్మిస్తున్న చిత్రం 'ఇద్దరిమధ్య 18'. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక మంగళవారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ కొట్టగా.. శివరాజ్ పాటిల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మానేపల్లి హనుమంతరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు నాని ఆచార్య మాట్లాడుతూ.. ''యూత్ అందరు ఏ పాయింట్ కు కనెక్ట్ అవుతారో అదే పాయింట్ ను తీసుకొని సినిమా చేస్తున్నాం. యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నాం. సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.
''నాని చెప్పిన కథ నచ్చి సినిమాను నిర్మించాలనుకుంటున్నాం. ఆడియన్స్ ఆదరిస్తారని కోరుకుంటున్నామని'' నిర్మాత శివరాజ్ పాటిల్ తెలిపారు.
''టైటిల్ లోనే క్యూట్ లవ్ స్టొరీ ఎలివేట్ అవుతుంది. మ్యూజిక్ కు స్కోప్ ఉన్న సినిమా. మొత్తం ఐదు పాటలు, ఒక బిట్ సాంగ్ ఉంటాయి. యూత్ కు మెసేజ్ ఇచ్చే విధంగా సినిమా ఉంటుందని'' మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ చెప్పారు.
''దృశ్యకావ్యం సినిమా తరువాత మరో మంచి సినిమాలో నటించే అవకాశం వచ్చిందని'' హీరో కార్తీక్ అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.ఎమ్.క్రిష్, సంగీతం: ఘంటాడి కృష్ణ, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: బి.రాంచందర్ సింగ్, మేనేజర్: శివ కోవూరి, నిర్మాత: శివరాజ్ పాటిల్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: నాని ఆచార్య.