Advertisementt

పవన్ కళ్యాన్ నా ఇన్స్పిరేషన్: వరుణ్

Sat 02nd Apr 2016 04:19 PM
varun birthday celebrations,lajja,manalo okadu  పవన్ కళ్యాన్ నా ఇన్స్పిరేషన్: వరుణ్
పవన్ కళ్యాన్ నా ఇన్స్పిరేషన్: వరుణ్
Advertisement
Ads by CJ

'లజ్జ' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకు పరిచయమయిన నటుడు వరుణ్. చిన్నప్పటినుండి సినిమాల మీద ఉన్న ప్యాషన్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ నటుడు ఏప్రిల్ 2 న తన కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు. ఈ సందర్భంగా వరుణ్ విలేకర్లతో ముచ్చటించారు. ''నేను పదవ తరగతి చదివే రోజుల్లో ఒక లఘు చిత్రంలో నటించాను. అది చూసిన ఆర్.పి.పట్నాయక్ గారు నాకు 'మనలో ఒకడు' సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా షూటింగ్ జరిగే సమయంలోనే నరసింహ నంది గారు డైరెక్ట్ చేస్తోన్న 'లజ్జ' సినిమాలో ఛాన్స్ వచ్చింది. మనలో ఒకడు మొదటి సినిమా అయినా.. లజ్జ సినిమా మొదట రిలీజ్ అయింది. మనలో ఒకడు సినిమా కూడా టాకీ పార్ట్ పూర్తయింది. త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలానే నరసింహ నంది గారి డైరెక్షన్ లో 'బుడ్డారెడ్డి పల్లి బ్రేకింగ్ న్యూస్' సినిమాలో నటిస్తున్నాను. అది కాకుండా మే మొదటివారంలో నేను నటించబోతున్న మరో సినిమా మొదలుకానుంది. తెలుగులో నాకు పవన్ కళ్యాన్ గారంటే చాలా ఇష్టం. ఆయన ఇన్స్పిరేషన్ తోనే నటుడినయ్యాను. కొత్త కొత్త పాత్రలు చేసుకుంటూ.. మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నా'' అని వరుణ్ తెలిపాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ