Advertisementt

థ్రిల్లింగ్ కామెడీగా 'బంతిపూల జానకి'!

Thu 31st Mar 2016 04:48 PM
banthipoola janaki,dhanraj,praveen chandar,diksha panth  థ్రిల్లింగ్ కామెడీగా 'బంతిపూల జానకి'!
థ్రిల్లింగ్ కామెడీగా 'బంతిపూల జానకి'!
Advertisement
Ads by CJ

సుడిగాలి సుదీర్, షకలక శంకర్, ధనరాజ్, దీక్షా పంత్ ప్రధాన పాత్రల్లో ఉజ్వల క్రియేషన్స్ బ్యానర్ పై నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో కల్యాణి రామ్ నిర్మిస్తోన్న చిత్రం 'బంతిపూల జానకి'. ఈ సినిమా గుమ్మడికాయ ఫంక్షన్ గురువారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో.. దర్శకుడు ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ.. ''ఇది నా రెండవ చిత్రం. సింగిల్ షెడ్యూల్ లో చిత్రాన్ని పూర్తి చేశాం. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం గా తెరకెక్కించాం. థ్రిల్లింగ్ కామెడీ జోనర్ లో ఇప్పటివరకు తెలుగులో సినిమాలు రాలేదు. మా సినిమా కచ్చితంగా అందరికి నచ్చుతుంది. ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటివారంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని'' తెలిపారు.

''జానకి టైటిల్ రోల్ లో నటిస్తున్నాను. ఇప్పటివరకు షూటింగ్ బాగా జరిగిందని, సినిమా హిట్ కావాలని'' దీక్షా పంత్ కోరారు.

''ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపిస్తాను. సినిమాలో నాలుగు పాత్రలు మెయిన్ పిల్లర్స్. మంచి టీం కుదిరిందని'' ధనరాజ్ చెప్పారు.

''మంచి కుటుంబ కథా చిత్రంగా 'బంతిపూల జానకి' అందరిని అలరిస్తుందని'' సుడిగాలి సుదీర్ అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: భోలే, ఎడిటింగ్: శివ.వై. ప్రసాద్, కథ-మాటలు: శేకర్ విఖ్యాత్, పాటలు: కాసర్ల శ్యామ్, ఆర్ట్: విజయ్ కృష్ణ, నిర్మాత: కల్యాణి రామ్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ