Advertisementt

ముస్తాబవుతున్న 'చుట్టాలబ్బాయి'!

Thu 31st Mar 2016 04:32 PM
chuttalabbayi,aadi,veerabadhram,venkat thalari  ముస్తాబవుతున్న 'చుట్టాలబ్బాయి'!
ముస్తాబవుతున్న 'చుట్టాలబ్బాయి'!
Advertisement
Ads by CJ

రికవరీ బాబ్జీ పాత్రలో చుట్టూ ఉండే అందరిని కలుపుకుపోయే పాత్రలో 'చుట్టాలబ్బాయి' సినిమాలో నటిస్తున్నానని హీరో ఆది చెప్పారు. ఆది హీరోగా, నమిత, యామిని హీరోయిన్లుగా శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ పతాకంపై రామ్ తాళ్ళూరి సమర్పణలో వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి నిర్మిస్తున్న చిత్రం 'చుట్టాలబ్బాయి'. ఈ సినిమా ఎనభై శాతం టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హీరో ఆది మాట్లాడుతూ.. ''ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథను తీసుకొని ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఇప్పటికే సినిమా 80 శాతం టాకీ పార్ట్ పూర్తి చేసుకొంది. డైరెక్టర్ గారు నాకు చెప్పిన దానికంటే ఇంకా బాగా ప్రెజంట్ చేశారు. సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ మొదటివారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

''బ్యాంకాక్, రాజమండ్రీ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించాం. సినిమా బాగా వచ్చింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కించాం. నిర్మాతలు బాగా సపోర్ట్ చేస్తున్నారని'' దర్శకుడు వీరభద్రమ్ తెలిపారు.

''ఇంకా సాంగ్స్ బ్యాలన్స్ ఉన్నాయి. ఇంట్రడక్షన్ పాటను బ్యాంకాక్ లో చిత్రీకరించామని'' నిర్మాత వెంకట్ తలారి అన్నారు.

''సెంటిమెంట్ తో కూడిన ఎంటర్టైనర్ గా సినిమా అందరినీ అలరిస్తుందని'' అన్నపూర్ణమ్మ చెప్పారు.

''తమకు సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పి, సినిమా హిట్ కావాలని'' నమిత, యామిని కోరుకున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరామెన్: నాగేంద్ర, ఆర్ట్: ఎస్.శేఖర్, ప్రొడ్యూసర్: వెంకట్ తలారి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వీరభద్రమ్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ