Advertisementt

ముంబైలో టాలీవుడ్ స్టార్స్ హడావిడి!

Wed 30th Mar 2016 02:17 PM
tolly wood stars,mumbai,telugu heros at mumbai,  ముంబైలో టాలీవుడ్ స్టార్స్ హడావిడి!
ముంబైలో టాలీవుడ్ స్టార్స్ హడావిడి!
Advertisement
Ads by CJ

మహారాష్ట తెలుగు మంచ్ ఆధ్వర్యంలో ఈ యేడాది ఉగాది సంబరాలు ముంబైలో ఘనంగా జరుగబో తున్నాయి. ఏప్రిల్ 3వ తేదీ ఆదివారం ఉదయం 10.00 గంటలకు బాంద్రా లోని రంగ్ శారదా ఆడిటోరియంలో ఈ వేడుక జరుగబోతోంది.  మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సిహెచ్. విద్యాసాగర్ రావు, తమిళనాడు గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య ముఖ్యఅతిథిలుగా పాల్గొనబోతున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా సీనియర్ కళాకారులకు ఇతోధిక సేవ చేస్తున్న అధ్యక్ష కార్యదర్శులు రాజేంద్ర ప్రసాద్, శివాజీరాజాను ఈ వేదికపై సత్కరించబోతున్నారు. అలానే శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్, ఇటీవలే డాక్టరేట్ ను అందుకున్న సీనియర్ నటుడు నరేశ్, భారతీయ చిత్రసీమ గర్వపడే అపురూప చిత్రాలను రూపొందించిన స్వర్గీయ ఏడిద నాగేశ్వరరావు తనయుడు ఏడిద శ్రీరామ్ ను కూడా సన్మానిస్తారు.‘పెళ్ళైన కొత్తలో’ ఫేమ్ అగస్త్య ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమం కూడా జరగబోతోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ