క్రాంతి మాధవ్ లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ తో సునీల్ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని దర్శకుడు వి.వి.వినాయక్ తెలిపారు. సునీల్, మియా జంటగా యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ పతాకంపై క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా సోమవారం హైదరబాద్ లో ప్రారంభమైంది. పరుచూరి కిరీటి నిర్మాత. ముహుర్తపు సన్నివేశానికి దిల్‌రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, డి.సురేష్‌బాబు క్లాప్ కొట్టారు. క్రాంతి మాధవ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో సునీల్ మాట్లాడుతూ.. ''రెండు గంటలు సినిమా కథ విన్న తరువాతే సినిమా చేయడానికి అంగీకరించాం. మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసుకొని సెట్స్ మీదకు వెళ్తున్నామని, తన కెరీర్ లో పెద్ద హిట్ సినిమా అవుతుందని'' సునీల్ చెప్పారు.
''ఓ మంచి కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి కాస్త గ్యాప్ తీసుకున్నాను. ఈ సినిమాకు సునీల్ హీరో అయితే యాప్ట్ అవుతుందని ఆయనకు కథ చెప్పి ఓకే చేయించుకున్నాను. సునీల్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కామెడీ కొత్తగా ఉంటుందని'' దర్శకుడు క్రాంతి మాధవ్ అన్నారు.
''సునిల్ గారికి కథ బాగా నచ్చడంతో సినిమా మొదలుపెట్టాం. ఆయనతో పాటు టీం అందరికి మంచి పేరు రావాలని'' నిర్మాత పరుచూరి కిరీటి చెప్పారు.
సునీల్, మియా, సంపత్, అలీ, ఆశిష్ విద్యార్థి, వెన్నెలకిషోర్, పృథ్వీ, సుబ్బరాజు, దువ్వాసి మోహన్ తదితరులు తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ః జిబ్రాన్, ఆర్ట్ డైరెక్టర్ః ఎ.యస్.ప్రకాష్, ఎడిటర్ః కోటగిరి వెంకటేశ్వరరావు, డైలాగ్స్ః చంద్రమోహన్ చింతాద, నిర్మాతః పరుచూరి కిరిటీ, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వంః కె.క్రాంతిమాదవ్.