Advertisementt

'థేరీ' తెలుగు వివరాలు త్వరలో!

Mon 28th Mar 2016 02:00 PM
theri,dil raju,kalaipuli s thanu,theri movie telugu updates,vijay,samantha  'థేరీ' తెలుగు వివరాలు త్వరలో!
'థేరీ' తెలుగు వివరాలు త్వరలో!
Advertisement
Ads by CJ

విజయ్  'థేరీ' చిత్రం తెలుగు లో విడుదల చేయనున్న దిల్ రాజు మరియు కలయిపులి ఎస్ థాను
తమిళ చలన చిత్ర పరిశ్రమ లోనే కాకుండా, తెలుగు రాష్ట్రాలలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది సూపర్ స్టార్ విజయ్ నటించిన 'థేరీ' సినిమా ట్రైలర్. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు లో  ఉత్తమ అభిరుచి గల నిర్మాత దిల్ రాజు మరియు కలయిపులి తాను విడుదల చేయనున్నారు.
'రాజా రాణి' చిత్రం తో మంచి పేరు సంపాదించుకున్న అట్లి దర్శకత్వం లో ముస్తాబవుతోన్న ఈ చిత్రం పై భారీ ఆశలు ఉన్నాయి. భారీ వ్యయం తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని అట్లి తెరకెక్కించారు.
'తుపాకి వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి ఫాం లో ఉన్న విజయ్ హీరో గా, రాజా రాణి తో మంచి పేరు తెచ్చుకున్న అట్లి దర్శకత్వం లో వస్తోన్న ఈ చిత్రం తెలుగు లో  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ద్వారా విడుదల అవుతుంది. ఈ చిత్రం తెలుగు లో మంచి విజయం సాధిస్తుంది అన్న నమ్మకం ఉంది'.., అని దిల్ రాజు తెలిపారు.
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం తెలుగు టైటిల్ మరియు తెలుగు ఆడియో వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం అని చిత్ర బృందం తెలిపింది.
విజయ్ , సమంత, అమీ జాక్సన్, ప్రభు, రాధిక, మహేంద్రన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు
దర్శకత్వం - స్క్రీన్ప్లే - అట్లి  .ఫోటోగ్రఫీ - జార్జ్ సి విలియమ్స్ . ఎడిటర్ -అన్తోనీ రుబెన్  . సంగీతం - జి . వి . ప్రకాష్ కుమార్.  సహా నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్. నిర్మాతలు - రాజు , కలయిపులి ఎస్ థాను

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ