Advertisementt

విష్ణు కెరీర్ కి మైలురాయి: మోహన్ బాబు

Sun 27th Mar 2016 05:47 PM
eedo rakam aado rakam audio launch,manchu vishnu,nageshwara reddy  విష్ణు కెరీర్ కి మైలురాయి: మోహన్ బాబు
విష్ణు కెరీర్ కి మైలురాయి: మోహన్ బాబు
Advertisement
Ads by CJ

''హీరో అనేవాడు కామెడీ చేయడం మామూలు విషయం కాదు. విష్ణు ఇదివరకు 'డీ, దేనికైనా రెడీ, రౌడీ' వంటి విభిన్న చిత్రాల్లో నటించాడు. ఆ మూడు సినిమాలకంటే తను నటిస్తోన్న 'ఈడో రకం ఆడో రకం' సినిమా పెద్ద హిట్ అవుతుంది. తన కెరీర్ లో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందని'' మంచు మోహన్ బాబు తెలిపారు. మంచి విష్ణు, రాజ్ తరుణ్, సొనారిక, హేబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'ఈడో రకం ఆడో రకం'. జి.నాగేశ్వర రెడ్డి దర్శకుడు, అనిల్ సుంకర నిర్మాత. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ శనివారం హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో జరిగింది. మంచు మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్ కలిసి బిగ్ సీడీను ఆవిష్కరించారు. మంచు మోహన్ బాబు ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను హీరో సునీల్ కు అందించారు. ఈ కార్యక్రమంలో మంచు మోహన్ బాబు మాట్లాడుతూ.. ''దర్శకుడు నాగేశ్వరరెడ్డి అంటే నాకు చాలా ఇష్టం. డైమండ్ రత్నం మంచి రచయిత. నిజానికి ఈ సినిమా రైట్స్ మొదట నేనే తీసుకున్నాను. మంచు విష్ణు ఈ సినిమా వేరే కాంబినేషన్ లో చేయాలనుకున్నాడు. ఫైనల్ గా అనిల్ సుంకర, నాగేశ్వర రెడ్డి లతో సినిమా చేశాడు. హీరో అనేవాడు కామెడీ చేయడం మామూలు విషయం కాదు. విష్ణు ఇదివరకు 'డీ, దేనికైనా రెడీ, రౌడీ' వంటి విభిన్న చిత్రాల్లో నటించాడు. ఆ మూడు సినిమాలకంటే తను నటిస్తోన్న 'ఈడో రకం ఆడో రకం' సినిమా పెద్ద హిట్ అవుతుంది. తన కెరీర్ లో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుంది. విష్ణు కామెడీ అధ్బుతంగా పండించాడు. ఈ సినిమాతో తనతో పాటు మరో హీరో రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. ఎవరి మధ్యనైనా బంధాలు ఉండాలి. ఈగో ఉంటే పాతాళానికి వెళ్ళిపోతారు. విష్ణు, రాజ్ తరుణ్ కలిసి నటించడం సంతోషంగా ఉంది. వారిద్దరూ ఇలానే మరో రెండు సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. రాజేంద్రప్రసాద్ రకరకాల పాత్రల్లో నటించాడు. తను వెర్సటైల్ యాక్టర్'' అన్నారు. ''నా కెరీర్ లో బెస్ట్ ఫిలిం నాగేశ్వరరెడ్డి తో చేసానని'' రాజేంద్రప్రసాద్ తెలిపారు.  ''విష్ణు చెప్పే అబద్డంతో సినిమా మొదలవుతుంది. తను చెప్పిన అబద్ధం వలన మిగిలిన వారంతా ఎలా ఇబ్బంది పడ్డారనేదే సినిమా'' అని దర్శకుడు నాగేశ్వరరెడ్డి చెప్పారు.

''ప్రతి ఆర్టిస్ట్ టెక్నీషియన్ తమ సొంత బ్యానర్ గా భావించి సినిమా చేశారు. సాయి కార్తిక్ మంచి బాణీలను అందించాడు. టైటిల్ సాంగ్ లో నటించిన సునీల్ కు నా థాంక్స్'' అని నిర్మాత అనిల్ సుంకర అన్నారు.

''నాగేశ్వరరెడ్డి గారు చేసిన రెండు సినిమాలను ప్రొడ్యూస్ చేశాను. రాజేంద్రప్రసాద్ గారు ఈ సినిమా సెట్స్ లో ఉన్నప్పుడు నాన్నగారే ఉన్నరనిపించేది. ఆయన నా ఫేవరేట్ యాక్టర్'' అని మంచు విష్ణు చెప్పారు. హీరో రాజ్ తరుణ్, సొనారిక, హేబ్బా, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ తమకు సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో వీరు పోట్ల, బివిఎస్ఎన్ ప్రసాద్, సునీల్, సుశాంత్, నిఖిల్ తదితరులు పాల్గొని చిత్రబృందాన్ని అభినందించారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ