Advertisementt

'రాజా చెయ్యి వేస్తే' ఆడియో విశేషాలు!

Sat 26th Mar 2016 01:11 PM
raja cheyyi vesthe audio launch,nara rohit,pradeep,sai korrapati  'రాజా చెయ్యి వేస్తే' ఆడియో విశేషాలు!
'రాజా చెయ్యి వేస్తే' ఆడియో విశేషాలు!
Advertisement
Ads by CJ

నారా రోహిత్, ఇషా తల్వార్ జంటగా వారాహిచలనచిత్రం బ్యానర్ పై సాయిశివాని సమర్పణలో ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందించిన సినిమా 'రాజా చెయ్యి వేస్తే'. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం విజయవాడలో జరిగింది. ఈ సినిమా ఆడియో సీడీలను నారాచంద్రబాబునాయుడు విడుదల చేసి తొలి సీడీని నందమూరి బాలకృష్ణకు అందించారు. నందమూరి బాలకృష్ణ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా..

నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ''తెలుగు సినిమాకు ఒక చరిత్ర ఉంది. హిందీ తర్వాత ఆ స్థాయి మార్కెట్ ఉన్న భాష చిత్రం తెలుగు. సుమారుగా భారతదేశంలో సంవత్సరానికి సినిమాల మీద 10 వేలకోట్ల బిజినెస్ జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమాలు తీయడానికి అందమైన లోకేషన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సినిమాలు తీస్తే ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తాం. 'బాణం' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో పరిచయమయ్యి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు నారా రోహిత్. ఈ సినిమాలో తారక రత్న విలన్ గా నటించడం సంతోషంగా ఉంది. సాయి కొర్రపాటి సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ మంచి మ్యూజిక్ అందించారు. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ''సాయి కొర్రపాటి నాతో లెజెండ్ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేసినట్లు తెలుస్తోంది. ప్రదీప్ బాగా డైరెక్ట్ చేశాడనిపిస్తుంది. సాయి కార్తిక్ మంచి బాణీలను అందించాడు. నారా రోహిత్, తారక రత్న కాంబినేషన్ చూస్తుంటే సినిమా కొత్తగా ఉంటుందనిపిస్తుంది. సినిమా మంచి సక్సెస్ కావాలి'' అని చెప్పారు.

నారా రోహిత్ మాట్లాడుతూ.. ''వారాహి బ్యానర్ లో ఈ సినిమా చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ప్రదీప్ కు ఆర్టిస్టుల దగ్గర నుండి ఎలాంటి పెర్ఫార్మన్స్ రాబట్టుకోవాలో బాగా తెలుసు. సాయి కార్తిక్ తో వరుసగా సినిమాలు చేస్తున్నాను. ఇది మా కాంబినేషన్ లో వస్తోన్న ఐదవ సినిమా. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.

ప్రదీప్ చిలుకూరి మాట్లాడుతూ.. ''నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి కొర్రపాటి గారికి, నారా రోహిత్ కు కృతజ్ఞతలు'' అని చెప్పారు. 

సాయి కార్తిక్ మాట్లాడుతూ.. ''ఇలాంటి ఓ పెద్ద సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం రావడం నా అద్రుష్టంగా భావిస్తున్నాను. టీం అందరికి నా అభినందనలు'' అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ