శ్రీమతి శ్రీలత నాయుడు సమర్పణలో సర్వోదయ మూవీస్ బ్యానర్ పై తరుణ్ తేజ, శరత్ అలి, శ్రీలేఖ, హరిత తారాగణంగా సర్వోదయ మూవీస్ బ్యానర్ పై రూపొందిన చిత్రం 'ఒకే ఒక ఆశ'. పరాంకుశం రవికుమార్ దర్శకత్వంలో జాని, చిన్నయ్య దొర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నటి కవిత ఆడియో సీడీలను విడుదల చేశారు. తొలి సీడీని సాగర్, సాయి వెంకట్ అందుకున్నారు. ఈ సందర్భంగా....
కవిత మాట్లాడుతూ.. ''దర్శకుడు రవికుమార్ చాలాకాలంగా పరిచయం. సినిమాలంటే ఎంతో ప్యాషన్ ఉన్న వ్యక్తి. కొత్త నటీనటులతో తెరకెక్కించిన ఈ సినిమా, పాటలు పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. సినిమా పెద్ద సక్సెస్ సాధించి దర్శక, నిర్మాతలకు మంచి పేరు, డబ్బులు రావాలని భావిస్తున్నాను. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్'' అని అన్నారు.
సాగర్ మాట్లాడుతూ.. ''దర్శకుడు రవి చాలా తక్కువ బడ్జెట్ లో ఎక్కువ క్వాలిటీతో చేసిన చిత్రమిది. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ యూనిట్ కు అభినందనలు తెలియజేస్తున్నాను'' అని అన్నారు.
సాయివెంకట్ మాట్లాడుతూ.. ''డైరెక్టర్ రవి చాలా కాలంగా తెలుసు. దర్శకుడు కావాలనుకున్న తన కల ఈ రోజు నిజమైంది. పాటలు బావున్నాయి. సినిమా పెద్ద హిట్ సాధించి రవికుమార్ అగ్ర దర్శకుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.
దర్శకుడు పరాంకుశం రవికుమార్ మాట్లాడుతూ.. ''నా కథను, నన్ను నమ్మి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. సినిమాలో మూడు పాటలు ఉన్నాయి. ఏప్రిల్ మొదటివారంలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.
సత్యనారాయణ, యాకూబ్ బాషా, సుమంత్, సునీత, సమీర్, రామ్మోహన్ రెడ్డి తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి కెమారా: ఎస్.రైసాబ్, ఎడిటింగ్: వెంకటేశ్వర్లు, పాటలు: రవికుమార్, ఐ.రమణారెడ్, సిహెచ్.ఎన్.దాస్, సహ నిర్మాతలు: పి.పద్మజ, పి. శ్రీలత నాయుడు, నిర్మాతలు: జాని, చిన్నయ్యదొర, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: పరాంకుశం రవికుమార్.