Advertisementt

'ఆమె ఎవరు?' పాటలు విడుదల!

Thu 24th Mar 2016 05:22 PM
aame evaru movie,veeraganesh,ramesh mugada,aarthi agarwal  'ఆమె ఎవరు?' పాటలు విడుదల!
'ఆమె ఎవరు?' పాటలు విడుదల!
Advertisement
Ads by CJ

ఆర్తీ అగర్వాల్ ప్రధాన పాత్రలో కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో శ్రీ బాలగణపతి ప్రొడక్షన్స్, శ్రీ సాయిదుర్గా చిత్రాలయ పతాకాలపై రమేష్ ముగడ దర్శకత్వంలో వీరగణేష్ కర్రి, లక్ష్మీ సరోజ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఆమె ఎవరు..?. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు గారు ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా..

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ''చాలామంది సినిమా మీద అవగాహన లేకుండా ఇండస్ట్రీకు వచ్చి.. ఎలాగైనా సినిమా చేయాలని విపరీతంగా ఖర్చు పెట్టి చివరకు రిలీజ్ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ చిత్ర నిర్మాతది కూడా అదే పరిస్థితి. దయచేసి సినిమా మీద అవగాహన ఉన్నవారు మాత్రమే సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు రమేష్ ముగడ మాట్లాడుతూ.. ''హారర్ కామెడీ కథాంశంతో రూపొందించిన చిత్రమిది. సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది. ఏప్రిల్ 1న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.

నిర్మాత వీరగణేష్ కర్రి మాట్లాడుతూ.. ''సినిమా మీద అవగాహన లేకుండా ఇండస్ట్రీకు వచ్చి ఉన్న ఆస్తులు అన్ని అమ్మి ఈ సినిమా చేశాను. సినిమా ఆరు నెలల క్రితమే పూర్తయింది. కాని రిలీజ్ చేసుకోలేకపోయాను. చిన్న సినిమా అని ఎవరు పట్టించుకోలేదు. ప్రేక్షకులు, ఇండస్ట్రీ పెద్దలు చిన్న చిత్రాలను ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

చలపతిరావు, కాదంబరి కిరణ్, ధన్ రాజ్, నల్లవేణు, సైదులు, అల్లరి సుభా షిణి, అపూర్వ, పి.యస్.కుమార్, రజిత తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: ఆర్.కె., ఫైట్స్: నాగరాజు, ఎడిటర్: మేనగ శ్రీను, కెమెరా: సేనాపతి, మాటలు: ఆర్.ఫణీంద్ర, ఓం ప్రసాద్ వాకాటి, పాటలు: రామ్ పైడిశెట్టి, సురేష్ గంగుల, కైలాస్ బొమ్మాళి, ఐటెం రాజు, కొరియోగ్రఫీ: చార్లీ, సంగీతం: చిన్నికృష్ణ, నిర్మాతలు: వీరగణేష్ కర్రి, లక్ష్మీ సరోజ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రమేష్ ముగడ.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ