Advertisementt

'రన్' సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు!

Wed 23rd Mar 2016 11:15 AM
run movie gummadikaya function,sandeep kishan,ani kanneganti  'రన్' సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు!
'రన్' సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు!
Advertisement
Ads by CJ

సందీప్ కిషన్, అనీషా ఆంబ్రోస్ జంటగా అని కన్నెగంటి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి, కిషోర్ గరికిపాటి, అజయ్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'రన్'. ఈ సినిమా గుమ్మడికాయ ఫంక్షన్ మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా..

దర్శకుడు అని కన్నెగంటి మాట్లాడుతూ.. ''ఈ సినిమా మొదలవ్వడానికి కారణం అనిల్ గారు, సుధాకర్ గారు. నాకు నచ్చిన కథను చేసే అవకాశం కల్పించారు. వారు అందించిన సపోర్ట్ మర్చిపోలేనిది. ఈ సినిమాకు హార్ట్ ఫోటోగ్రఫీ. ఒరిజినల్ ను మరిపించేలా.. ఫోటోగ్రఫీ అందించిన రాజశేఖర్ గారికి థాంక్స్. సందీప్ ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో నటించలేదు. అండర్ ప్లే పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. బాబీ సింహా సినిమాకు మెయిన్ పిల్లర్. సపోర్ట్ చేసిన ప్రత్హి ఒక్కరికి థాంక్స్. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ''సినిమా అనుకున్నదానికంటే బాగా వచ్చింది. మంచి సినిమా చేశామనే నమ్మకం ఉంది. అని కన్నెగంటి తో మంచి ఎమోషనల్ బాండింగ్ ఉంది. ప్రతి టెక్నీషియన్ కష్టపడడం వలనే తొందరగా సినిమాను కంప్లీట్ చేసి మార్చి 23న రిలీజ్ చేస్తున్నాం. సాయి కార్తిక్ అందించిన ఆల్బంలో ప్రతి పాట ప్రేక్షకులను అలరించింది. నా కష్టసుఖాల్లో తోడుగా ఉన్న వ్యక్తి అనిల్ సుంకర గారు. ఈ సినిమాతో నిర్మాతకు లాభాలు రావాలి. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

అనిల్ సుంకర మాట్లాడుతూ.. ''ఈ సినిమాతో మంచి అనుభూతి మిగిలింది. తక్కువ సమయంలో క్వాలిటీ అవుట్ పుట్ కోసం అందరూ కష్టపడ్డారు. రేపే సినిమా రిలీజ్ అవుతోంది. మాకు నచ్చిన సినిమా ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

అనీషా ఆంబ్రోస్ మాట్లాడుతూ.. ''నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, సందీప్ కు థాంక్స్. సాయి కార్తిక్, రఘు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ