Advertisementt

'దృశ్యకావ్యం' సక్సెస్ మీట్!

Mon 21st Mar 2016 01:58 AM
drusyakavyam movie success meet,ram karthik,ramakrishna reddy  'దృశ్యకావ్యం' సక్సెస్ మీట్!
'దృశ్యకావ్యం' సక్సెస్ మీట్!
Advertisement
Ads by CJ

రామ్ కార్తీక్, కాశ్మీర కులకర్ణి జంటగా పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై శ్రీమతి బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం 'దృశ్యకావ్యం'. ఇటీవల విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

శ్రీకాంత్ మాట్లాడుతూ.. ''రామకృష్ణారెడ్డి గారు నేను నటించిన 'వీడికి దూకుడెక్కువ' చిత్రాన్ని నిర్మించారు. మొదటిసారి దర్శకునిగా మారి ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. డైరెక్టర్ గా కూడా రామకృష్ణా రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. ఇలానే మంచి మంచి సినిమాలను తీయాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ''అన్ని ఏరియాల నుండి సినిమాకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. తండ్రి కూతుళ్ళ మధ్య ఉండే అనుబంధం ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అవుతుంది. మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఫ్యామిలీతో చూడదగిన చిత్రమిది'' అని చెప్పారు.

కమలాఖర్ మాట్లాడుతూ.. ''సినిమాలో పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ ను ఎలివేట్ చేశాయి. సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్'' అని చెప్పారు.

రామ్ కార్తిక్ మాట్లాడుతూ.. ''సపోర్ట్ చేసిన టీం అందరికి థాంక్స్. పాటలు, సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సంతోష్, కాశ్మీర, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సినిమాకు సంగీతం: కమలాఖర్, కెమెరామెన్: సంతోష్ శానమోని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొల్లు శివనాగేంద్రరావు, ఎడిటర్: వి.నాగిరెడ్డి, దర్శకుడు: బెల్లం రామకృష్ణారెడ్డి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ