50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'మయసభ'
ఖమ్మం క్రియేషన్స్ బ్యానర్‌పై చిత్రం శ్రీను, శ్రీవల్లి ప్రధాన పాత్రదారులుగా నెప్పలి కృష్ణ దర్శకత్వంలో సరోజని, దేవా, కోటయ్య, రమణారెడ్డి నిర్మాతలుగా తెరకెక్కుతున్న చిత్రం మయసభ. ఈ చిత్రం 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా చిత్రం శ్రీను మాట్లాడుతూ..'సింగిల్ షెడ్యూల్‌లో సినిమా పూర్తిచేయాలని సంకల్పించి..ఇప్పటి వరకు 50 శాతం షూటింగ్‌ను పూర్తి చేశాము. ఇంకా 10 రోజులు ఖమ్మం పట్టణంలో, 10 రోజులు కృష్ణాజిల్లా మైలవరంలోనూ మరో 10 రోజులు హైదరాబాద్‌లో షూటింగ్ జరిపి చిత్రీకరణ పూర్తిచేస్తాము. ఈ చిత్రంలో నాలుగు పాటలుంటాయి. ఆధ్యంతం కామెడీతో ఈ మయసభ ప్రేక్షకులను అలరిస్తుంది...'అని తెలిపారు.
నిర్మాతలు మాట్లాడుతూ...'ఈ మూవీ షూటింగ్ సింగిల్ షెడ్యూల్‌లో జరుపుతున్నాము. ఇప్పటి వరకు 50 శాతం షూటింగ్ పూర్తయింది. దర్శకుడు నెప్పలి కృష్ణ..ఈ మూవీని చాలా చక్కగా..అందరినీ నవ్వించే విధంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో సరికొత్త కామెడీని ప్రేక్షకులు చూస్తారు. అతి త్వరలో చిత్రీకరణ పూర్తిచేసి..మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము..' అని అన్నారు.
చిత్రం శ్రీను, శ్రీవల్లి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో చింటు, జూనియర్ రేలంగి, శకలక శంకర్, రాఘవ, రమణారెడ్డి, వెంకట్, దేవా, కోటయ్యలు ఇతర తారగణం.
ఈ చిత్రానికి సంగీతం: సాకేత్, పాటలు: శ్రీమాన్, కాసర్ల శ్యామ్, ఫైట్ మాస్టర్ : నాగరాజు.పి, కెమెరా: గోపి కాకర్ల,
నిర్మాతలు: సరోజని, దేవా, కోటయ్య, రమణారెడ్డి
కథ, దర్శకత్వం: నెప్పలి కృష్ణ