Advertisementt

ఎస్.వి.సి ఎంటర్టైన్మెంట్స్ నూతన చిత్రం ప్రారంభం!

Sat 19th Mar 2016 09:07 PM
svc entertainments,naveen vijay krishna,nithya,giri  ఎస్.వి.సి ఎంటర్టైన్మెంట్స్ నూతన చిత్రం ప్రారంభం!
ఎస్.వి.సి ఎంటర్టైన్మెంట్స్ నూతన చిత్రం ప్రారంభం!
Advertisement

నవీన్ విజయ్ కృష్ణ, నిత్యా నరేష్ జంటగా పి.వి.గిరి దర్శకత్వంలో ఎస్.వి.సి ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా శనివారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైంది. బిక్షమయ్య సంగం, రాధాకిషోర్ గుబ్బల నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ క్లాప్ కొట్టగా.. సాయి ధరమ్ తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విజయ నిర్మల గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. ''నవీన్ కు సినిమా కథ నచ్చి ఇంట్రెస్ట్ తో ఒప్పుకున్నాడు. హీరోగా నవీన్ అన్ని విధాలుగా ట్రైన్ అయ్యాడు. ఈ సినిమా తనకు పెద్ద సక్సెస్ కావాలి'' అని చెప్పారు.

విజయనిర్మల మాట్లాడుతూ.. ''సినిమా బాగా రావాలి. పెద్ద సక్సెస్ కావాలి'' అని చెప్పారు.

సీనియర్ నరేష్ మాట్లాడుతూ.. ''గత కొంతకాలంగా ఇండస్ట్రీలో వస్తోన్న చిన్న సినిమా, పెద్ద సినిమా ఇలా అన్ని హిట్స్ అవుతున్నాయి. పరిశ్రమలో కొత్త ఒరవడి మొదలయ్యింది. నా తనయుడు నవీన్ నటిస్తోన్న రెండో సినిమా ఇది. మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రంగా రూపొందిస్తున్నారు. నవీన్ నటుడే కాదు మంచి టెక్నీషియన్ కూడా. సింగిల్ సిట్టింగ్ లో తను ఈ కథను ఓకే చేశాడు. ఎంటర్టైన్మెంట్ కు లవ్ టచ్ ఉన్న యూత్ ఫుల్ సినిమా ఇది'' అని చెప్పారు.

దర్శకుడు గిరి మాట్లాడుతూ.. ''రచయితగా కొన్ని సినిమాలకు పని చేశాను. నవీన్ కు సినిమా కథ చెప్పిన వెంటనే బాగా నచ్చింది. ఇదొక లవ్ ఎంటర్టైనర్. ఏప్రిల్ 1 నుండి సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నాం'' అని చెప్పారు.

నిర్మాత బిక్షమయ్య మాట్లాడుతూ.. ''లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఏప్రిల్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ నిర్వహించనున్నాం'' అని చెప్పారు.

నవీన్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ.. ''ఇది నా రెండో చిత్రం . మొదటి సినిమా కూడా బాగా వచ్చింది. త్వరలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఇక ఈ సినిమా విషయానికొస్తే కథ విన్న వెంటనే సినిమా ఓకే చేసేసాను. అంత బాగా నచ్చింది. సినిమాలో తరువాత ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ కలుగుతుంది'' అని చెప్పారు.

ఈ చిత్రానికి పాటలు: రెహమాన్, డైలాగ్స్: పి.వి.గిరి, ఎ.సురేష్ బాబు, ఆర్ట్: వెంకట్ సన్నిధి, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, మ్యూజిక్: శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర, నిర్మాతలు: బిక్షమయ్య సంగం, రాధాకిషోర్ గుబ్బల, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.వి.గిరి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement