నీరజ్ శామ్, నేహ సక్సేనా, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో సంజీవ్ మేగోటి దర్శకత్వంలో మంగమూరి శేషగిరిరావు యశస్విని ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న చిత్రం 'దండు'. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. శ్రీవాస్, ముప్పలనేనిశివ బిగ్ సీడీను విడుదల చేయగా.. మల్టీడైమన్షన్ వాసు, రామసత్యనారాయణ, మల్కాపురం శివకుమార్ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..
శ్రీవాస్ మాట్లాడుతూ.. ''కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. కన్నడంలో విడుదలయిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా పెద్ద సక్సెస్ కావాలి. పాటలు చాలా బావున్నాయి. రిచ్ లోకేషన్స్ చిత్రీకరించారు. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.
ముప్పలనేని శివ మాట్లాడుతూ.. ''సినిమా ట్రైలర్, సాంగ్స్ బావున్నాయి. అన్ని ఎలిమెంట్స్ కలగలిపిన సినిమా ఇది. పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. ''రెండున్నర సంవత్సరాలు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. 1970 నుండి 1996 వరకు ఆదోనిలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించాను. కన్నడంలో ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. అలానే తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నాకు సపోర్ట్ చేసిన నా కుటుంబ సభ్యులకు, సినిమా టీం కు నా కృతజ్ఞతలు'' అని చెప్పారు.
సంధ్యా రవి మాట్లాడుతూ.. ''సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరి కమిట్మెంట్ నచ్చి సినిమాను సపోర్ట్ చేశాం. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: హరీస్ ఎస్.ఎన్, ఫైట్స్: థ్రిల్లర్ మంజు, సతీష్, శివ, డ్యాన్స్: కపిల్, ఆర్.కె, సాహిత్యం: పోతుల రవికిరణ్, విగినా రఫీ, సంగీతం: సంజీవ్ మెగోటి, ఎడిటింగ్: సర్వాణి శివకుమార్, అర్చన, సహ నిర్మాతలు: మెగోటి ఉమామహేశ్వరి, సత్యవతి, ఇ.రాము, లండన్ గణేష్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంజీవ్ మేగోటి.