Advertisementt

సింగిల్ కట్ లేకుండా సెన్సార్ పూర్తి!

Sat 19th Mar 2016 01:55 PM
oopiri,oopiri censor matter,oopiri movie,nagarjuna,karthi,tamanna,pvp,vamsi paidipally,clean u  సింగిల్ కట్ లేకుండా సెన్సార్ పూర్తి!
సింగిల్ కట్ లేకుండా సెన్సార్ పూర్తి!
Advertisement
Ads by CJ

సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న నాగార్జున, కార్తీల మల్టీస్టారర్ ‘ఊపిరి’....మార్చి 25న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్

'సోగ్గాడే చిన్ని నాయనా' వంటి సూపర్‌హిట్‌ చిత్రంతో 50 కోట్ల క్లబ్‌లో చేరిన కింగ్‌ నాగార్జున, 'ఆవారా' కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై 'బృందావనం', 'ఎవడు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ 'ఊపిరి'.  ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాను నాగార్జున కెరీర్ లో భారీ బడ్జెట్ తో అత్యధిక థియేటర్స్ లో మార్చి 25న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ..

ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ 'మనం, సోగ్గాడే చిన్ని నాయనా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల తర్వాత నాగార్జునగారు ఈ చిత్రంలో టోటల్‌గా డిఫరెంట్‌గా వుండే క్యారెక్టర్‌ చేస్తున్నారు. అలాగే 'ఆవారా' కార్తీ, తమన్నా జంట ఈ చిత్రంతో మరోసారి ఆడియన్స్‌ ని అలరించబోతున్నారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సింగిల్ కట్ కూడా లేకుండా  క్లీన్ యు సర్టిఫికేట్ ను పొందింది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమా బావుందని ప్రశంసించారు. మార్చి 25న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను వరల్డ్ వైడ్ గా 2000 థియేటర్స్ లో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, తమిళనాడు , కర్ణాటక, నార్త్ ఇండియా, యు.ఎస్, గల్ఫ్ కంట్రీస్, మలేషియా, శ్రీలంక, సింగపూర్, యు.కె, ఆప్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ల లో  సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నాం' అన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ