Advertisementt

సునీల్ కొత్త సినిమా టైటిల్ తెలిసిపోయింది!

Fri 18th Mar 2016 07:29 PM
jakkanna movie,sunil,vamsikrishna akella,sudharshan reddy  సునీల్ కొత్త సినిమా టైటిల్ తెలిసిపోయింది!
సునీల్ కొత్త సినిమా టైటిల్ తెలిసిపోయింది!
Advertisement
Ads by CJ

సునీల్, మన్నారా చోప్రా జంటగా వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'జక్కన్న'. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా..

హీరో సునీల్ మాట్లాడుతూ.. ''కొంచెం గ్యాప్ తరువాత మాస్, ఎనర్జిటిక్ రోల్ చేసిన సినిమా ఇది. రక్ష సినిమాను వంశీ ఆకెళ్ళ అధ్బుతంగా తీశాడు. కొత్త పాయింట్ తీసుకొని ఈ సినిమా చేశాడు. ఇప్పటివరకు ఈ పాయింట్ ను ఎవరు టచ్ చేయలేదు. ఎందుకు పనికిరాని ఒక మనిషి అధ్బుతంగా ఎలా మారాడనేదే సినిమా. సినిమాలో హీరోకు ఒకసారి సహాయం చేస్తే జీవితాంతం వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళు వద్దన్నా.. హెల్ప్ చేస్తూనే ఉంటాడు. ఫుల్ లెంగ్థ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ'' అని చెప్పారు.

దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ మాట్లాడుతూ.. ''కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కథ విన్న వెంటనే సునీల్ నటిస్తానని చెప్పాడు. అలానే నిర్మాత నన్ను నమ్మి సినిమా చేశారు. ఇప్పటికే ఎనభై శాతం సినిమా షూటింగ్ పూర్తయింది. సమ్మర్ లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.

నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ''ప్రేమ కథా చిత్రం తరువాత మంచి కథతో సినిమా చేయాలనుకున్నాం. వంశీ చెప్పిన స్టోరీ బాగా నచ్చింది. ప్రేమ కథా చిత్రంలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో.. ఈ సినిమాలో అంతకు మించి  ఉంటాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. డెబ్బై శాతం టాకీ పార్ట్ పూర్తయింది. పాటలు బ్యాలన్స్ ఉన్నాయి. ఏప్రిల్ లో షూటింగ్ పూర్తి చేసి మే నెలలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రాజా రవీంద్ర, రామ్ ప్రసాద్, భావాన్ని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: రామ్ ప్రసాద్, మ్యూజిక్: దినేష్, ఆర్ట్ డైరెక్టర్: మురళి, ఫైట్స్: కనల్ కన్నన్, డ్రాగన్ ప్రకాష్, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, డైలాగ్స్: భవాని ప్రసాద్, కో ప్రొడ్యూసర్స్: ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి, నిర్మాత: సుదర్శన్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వంశీ కృష్ణ ఆకెళ్ళ.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ