Advertisementt

చాకలి ఐలమ్మ చరిత్ర ఆధారంగా సినిమా!

Fri 18th Mar 2016 03:51 PM
chakali ilamma movie,sumana,lakshmi nikhil,pagadala mutthu  చాకలి ఐలమ్మ చరిత్ర ఆధారంగా సినిమా!
చాకలి ఐలమ్మ చరిత్ర ఆధారంగా సినిమా!
Advertisement

సుమనా, ముత్తు, శిల్ప ప్రధాన తారాగణంగా ముత్తు మూవీ మేకర్స్ పతాకంపై లక్ష్మీ నిఖిల్ దర్శకత్వంలో పగడాల ముత్తు నిర్మిస్తోన్న చిత్రం 'చాకలి ఐలమ్మ'. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణా హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి క్లాప్ కొట్టగా. దర్శకుడు లక్ష్మీ నిఖిల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ''పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జీవితాన్ని సినిమాగా తన జాతి వారే తెరకెక్కించడం అభినందనీయం. తెలంగాణా ప్రజల కోసం ఆమె చేసిన పోరాట కార్యక్రమాలు అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో చిత్రబృందం వారు సినిమా చేయడానికి పూనుకున్నారు. అట్టడుగు సమాజంలో ఉండే చాకలి ఐలమ్మ అహంకారానికి, అధికారానికి వ్యతిరేకంగా పోరాడేది. ఈ సినిమా సక్సెస్ అయ్యి 100 రోజులు ఆడాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు లక్ష్మీ నిఖిల్ మాట్లాడుతూ.. ''మొదట చాకలి ఐలమ్మ జీవితాన్ని డాక్యుమెంటరీగా రూపొందించాలనుకున్నాను. కాని ప్రభుత్వం సహాయంతో సినిమాగా చేస్తున్నాను. తెలంగాణాలో ఆమె గురించి చాలా మందికి తెలియదు. రాబోయే తరాల వారికి కూడా ఆమె చేపట్టిన కార్యక్రమాల గురించి తెలియబరచాలనే ఉద్దేశ్యంతో సినిమా చేస్తున్నాం. ఈ నెల 21 నుండి రెగ్యులర్ షూటింగ్ జరిపి రెండు షెడ్యూల్స్ లో సినిమా చిత్రీకరణ పూర్తి చేసి సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. వరంగల్, నల్గొండ, ఖమ్మం తదితర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించనున్నాం'' అని చెప్పారు.

నిర్మాత మాట్లాడుతూ.. ''చాకలి ఐలమ్మ జీవితాన్ని సినిమాగా చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వం వారు తమ సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు. వారి సపోర్ట్ తోనే సినిమా చేస్తున్నాం'' అని చెప్పారు.

ఈ చిత్రానికి రచయిత: మహమ్మద్, కో ప్రొడ్యూసర్: అనూష, హనుమంతరావు, కెమెరామెన్: ప్రవీణ్, ఆర్ట్ డైరెక్టర్: చౌదరి, మ్యూజిక్:సాగర్, నిర్మాత: పగడాల ముత్తు, దర్శకుడు: లక్ష్మీ నిఖిల్.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement