Advertisementt

'రన్' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

Thu 17th Mar 2016 09:14 PM
run movie release date,sandeep kishan,ani kanneganti,aneesha ambrose  'రన్' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!
'రన్' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!
Advertisement
Ads by CJ

సందీప్ కిషన్, అనీషా ఆంబ్రోస్ జంటగా అని కన్నెగంటి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి, కిషోర్ గరికిపాటి, అజయ్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'రన్'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 23న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రబృందం గురువారం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..

అనిల్ సుంకర మాట్లాడుతూ.. ''సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 23న సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇదొక థ్రిల్లింగ్ ఎంటర్టైనర్. ఈరోజు నుండి మా టీం అందరం కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించబోతున్నాం. ముందుగా ఎం.జి.ఐ.టి కళాశాలకు వెళ్ళనున్నాం'' అని చెప్పారు.

దర్శకుడు అని కన్నెగంటి మాట్లాడుతూ.. ''రన్ ఒక జెన్యూన్ డిఫరెంట్ ఫిలిం. పోస్టర్స్, ట్రైలర్స్ నుండి అన్ని కొత్తగా చేయడానికి ప్రయత్నించాం. నన్ను నమ్మి నాతో సినిమా చేసిన నిర్మాతలకు థాంక్స్. సందీప్ కిషన్ తో ఎప్పటినుండి సినిమా చేయాలనుకున్నాను. ఇప్పటికి కుదిరింది. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. సందీప్, అనీషా, బాబీ సింహా చక్కగా నటించారు'' అని చెప్పారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ''నేరమ్ సినిమా రీమేక్ గా ఈ చిత్రాన్ని రూపొందించాం. అందరం నమ్మి చేసిన సినిమా. టైం మీద ఆధారపడి నడిచే సినిమా. గుడ్ టైం, బ్యాడ్ టైం అనే టాపిక్ గా సినిమా ఉంటుంది. ఈ సినిమాతో మాకు గుడ్ టైం వస్తుందని ఆశిస్తున్నాం. సాధారణంగా సినిమా హిట్ అయిన తరువాత సక్సెస్ టూర్స్ కి వెళ్తారు. కాని మా సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్ళడానికి ముందుగానే మేము టూర్స్ ప్లాన్ చేశాం'' అని చెప్పారు.

సాయి కార్తిక్ మాట్లాడుతూ.. ''పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలానే సినిమా కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

అనీషా ఆంబ్రోస్ మాట్లాడుతూ.. ''మార్చి 23న సినిమా రిలీజ్ అవుతోంది. అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ