Advertisementt

సింగిల్ షాట్ లో 'సీసా' మూవీ!

Sat 12th Mar 2016 07:57 PM
seesa movie,releasing on march 18th,sivaji,ishaq,jagadeesh  సింగిల్ షాట్ లో 'సీసా' మూవీ!
సింగిల్ షాట్ లో 'సీసా' మూవీ!
Advertisement
Ads by CJ

శివాజి, నమ్రత, నిశాదేశ్ ప్రధాన పాత్రల్లో లక్ష్మీ వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై ఇషాక్ దర్శకత్వం వహించిన చిత్రం ''సీసా''. జగదీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 18న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో..

శివాజి మాట్లాడుతూ.. ''బూచమ్మ బూచోడు తరువాత దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకొని ఈ సినిమాలో నటించాను. ఈ సినిమా ఒక అధ్బుతం. కేవలం ఒక్క షాట్ లో సినిమా మొత్తం ఉంటుంది. ఒక్క షాట్ సినిమా అని విన్నప్పుడు నేను షాక్ అయ్యాను. దర్శకుడు ఇషాక్ ఈ సినిమా కోసం మెరీనా బీచ్ లో రిహార్సల్స్ చేశారు. అక్కడే ఒక ఇంట్లో ఈ సినిమాను షూట్ చేశాం. సినిమాలో అధ్బుతమైన డ్రామా, టెన్షన్, భయంకరమైన హారర్ ఉంటుంది. ఈ సినిమా చూసిన తరువాత టెక్నీషియన్స్ దమ్మేంటో తెలుస్తుంది. మార్చి 18న సినిమా విడుదలవుతుంది. అందరికి నచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ''రెండున్నర గంటల పాటు సింగిల్ షాట్ లో జరిగే సినిమా. సినిమా లవర్స్ థ్రిల్ ఫీల్ అవుతారు. ఒకే ఇంట్లో ఉండే 12 నుండి 13 లోకేషన్స్ లో సినిమాను చిత్రీకరించారు. హిందీలో మంచి కాస్టింగ్ తో ఈ సినిమా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు ఇషాక్ మాట్లాడుతూ.. ''సింగిల్ షాట్ లో సినిమా తీయడం అంత సులువు కాదు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ ఫిలిం. మార్చి 18న రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

నిర్మాత జగదీష్ మాట్లాడుతూ.. ''సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: రాజ్ భాస్కర్, రైటర్: బాషా శ్రీ, కెమెరా: నౌషత్, ఎడిటింగ్: హరి, ప్రొడ్యూసర్: జగదీష్, డైరెక్టర్: ఇషాక్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ