Advertisementt

'చంద్రుళ్లో ఉండే కుందేలు' టీజర్ లాంచ్!

Sat 12th Mar 2016 02:31 PM
chandrullo unde kundelu,venkata reddy,dhana srinivas  'చంద్రుళ్లో ఉండే కుందేలు' టీజర్ లాంచ్!
'చంద్రుళ్లో ఉండే కుందేలు' టీజర్ లాంచ్!
Advertisement
Ads by CJ

క్రాంతి చంద్, అవితేజ్, ప్రదీప్, అర్జున్, కోయల్ దాస్, సుపూర్ణ, పావని రెడ్డి, పమేల ప్రధాన పాత్రల్లో  శ్రీ సిద్ధి సెవెన్ హిల్స్ క్రియేషన్స్ బ్యానర్ పై వెంకటరెడ్డి ఉసిరిక దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'చంద్రుళ్లో ఉండే కుందేలు'. ధన శ్రీనివాస్ జామి, లక్ష్మీ వెంకటరెడ్డి నిర్మాతలు. ఈ సినిమా టీజర్ ను జడ్జ్ భాషా నవాబ్ ఖాన్ శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. అలానే మోషన్ పోస్టర్ ను మాజీ పార్లమెంట్ సభ్యులు తులసి రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా..

తులసి రెడ్డి మాట్లాడుతూ.. ''కళలు మానవ జీవితంలో ఓ అంతర్భాగం. కళలు లేని జీవితం నిత్తేజం, నిస్సారం. కళలు మానవునికి నయనానందాన్ని కలిగిస్తాయి. అంతేకాదు ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తున్నాయి. ఇండస్ట్రీలో ఇప్పటివరకు 5500 సినిమాలు వచ్చి ఉంటాయి. అనేక రకాల సినిమాలు వచ్చాయి. సమాజానికి సందేశాన్ని, వినోదాన్ని, ఉపాధిని కల్పించడానికి ఈ రంగాన్ని మొదలు పెట్టారు. శ్రీ సిద్ధి సెవెన్ హిల్స్ క్రియేషన్స్ అనే మంచి పేరుతో ఈ సినిమా బ్యానర్ ను స్థాపించారు. సినిమా టైటిల్ కూడా చాలా బావుంది. సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ''ఈ సినిమా టీజర్ చూస్తుంటే మంచి కుటుంబ కథా చిత్రంగా అనిపిస్తుంది. మ్యూజిక్ బావుంది. చక్కటి టైటిల్ ను సెలెక్ట్ చేసుకున్నారు. కొత్తవారంతా కలిసి చేస్తోన్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి'' అని చెప్పారు.

వి.సముద్ర మాట్లాడుతూ.. ''టైటిల్ వింటుంటే సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో అర్ధమవుతుంది. యూత్, ఫ్యామిలీ అందరూ చూడదగ్గ సినిమా అని తెలుస్తోంది. టీజర్ లో మంచి టీం వర్క్ కనిపిస్తోంది. ఇండస్ట్రీకు ఈ సినిమాతో మంచి టీం వస్తోందనిపిస్తుంది. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు వెంకటరెడ్డి ఉసిరిక మాట్లాడుతూ.. ''నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు థాంక్స్'' అని చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ''సినిమా ఇండస్ట్రీ మాకు కొత్త. డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేశాం. ప్రతి ఒక్కరూ మంచి సపోర్ట్ అందించారు. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.

ఈ చిత్రానికి ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, ఆర్ట్: శివకామేష్ దొడ్డి, రాజీవ్ నాయర్, పాటలు: శ్రీమణి, కరుణాకర్ అడిగర్ల, ఫైట్స్: విజయ్, జాషువా, రాంబాబు, డ్యాన్స్: స్వర్ణ, నిక్సన్, కిరణ్, రాజు, సంగీతం: విజయ్ గోర్తి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: దాము నర్రావుల, నిర్మాతలు: ధన శ్రీనివాస్ జామి, లక్ష్మీ వెంకటరెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు: విశ్వనాథ్, దర్శకత్వం: వెంకటరెడ్డి ఉసిరిక.

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ