రామ్ కార్తీక్, కాశ్మీర కులకర్ణి జంటగా పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై శ్రీమతి బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'దృశ్యకావ్యం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 18న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..
దర్శకుడు బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ''ఇది నా డెబ్యూ ఫిలిం. ఈ చిత్రానికి యు/ఏ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్నాటక, నార్త్ లలో మొత్తం 250 థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నాం. రిలీజ్ కు ముందే సినిమాకు మంచి పేరొచ్చింది. బిజినెస్ కూడా అలానే జరిగింది. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంటుంది. సినిమా చివరి వరకు సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. కథకు కమలాఖర్ తన మ్యూజిక్ తో ప్రాణం పోశాడు. సినిమాలో ప్రతి సీన్ అందరికి నచ్చేలా జాగ్రత్తగా తీశాం. నేపధ్య సంగీతం అందరినీ ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది. కామెడీ కూడా కథలో భాగంగా ఉంటుంది. మార్చి 18న రిలీజ్ అవుతోన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
రామ్ కార్తిక్ మాట్లాడుతూ.. ''ఇదొక లవ్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దృశ్యకావ్యం వినడానికి ఎంత బావుందో.. చూడడానికి ఇంకా బావుంటుంది. కమలాఖర్ గారి మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద అసెట్'' అని చెప్పారు.
ఈ సినిమాకు సంగీతం: కమలాఖర్, కెమెరామెన్: సంతోష్ శానమోని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొల్లు శివనాగేంద్రరావు, ఎడిటర్: వి.నాగిరెడ్డి, దర్శకుడు: బెల్లం రామకృష్ణా రెడ్డి.