Advertisementt

నాగార్జున కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది:పివిపి

Thu 10th Mar 2016 08:56 PM
oopiri movie trailer launch,akkineni akhil,nagarjuna,vamsi paidipalli,pvp  నాగార్జున కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది:పివిపి
నాగార్జున కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది:పివిపి
Advertisement

'సోగ్గాడే చిన్ని నాయనా' వంటి సూపర్ హిట్ చిత్రంతో 50 కోట్ల క్లబ్ లో చేరిన కింగ్ నాగార్జున, 'ఆవారా' కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్ లో పెరల్ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై 'బృందావనం', 'ఎవడు' వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఊపిరి'. ఈ సినిమా ట్రైలర్ ను నాగచైతన్య, అక్కినేని అఖిల్ కలిసి గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా..

అక్కినేని అఖిల్ మాట్లాడుతూ.. ''రెండు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం పని చేశారు. ఆ డెప్త్ ట్రైలర్ లోనే కనిపిస్తుంది. మా నాన్నే మా ఊపిరి, మా హీరో అలాంటి నాన్న కుర్చీలోనే కూర్చోవడం ఏంటని అసలు ఈ సినిమాలో నటించోద్దని చెప్పాం. కాని ట్రైలర్ చూసిన తరువాత చాలా ఎమోషనల్ అయ్యాను. వంశీ మంచి కథ ఇచ్చాడు. సినిమాటోగ్రాఫర్ వినోద్ ఈ సినిమాకు బ్యాక్ బోన్. నాన్నకు, కార్తీ కు మంచి బాండ్ ఉంది. అలానే వంశీకు, వినోద్ కు మంచి బాండ్ ఉంది. ఇలాంటి కాంబినేషన్స్ కలిస్తే మంచి విజువల్స్ వస్తాయి. చాలా సంతోషంగా ఉంది'' అని చెప్పారు.

నాగచైతన్య మాట్లాడుతూ.. ''ట్రైలర్ చూసిన తరువాత చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఇంత మంచి స్క్రిప్ట్ అందించిన వంశీకు థాంక్స్. వంశీ ఎప్పుడు ఒకే జోనర్ కు స్టిక్ అయ్యి సినిమాలు చేయడు. సినిమా సినిమాకు వైవిధ్యత చూపిస్తాడు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ పివిపి గారు యాప్ట్. కథ నచ్చితే దాని పట్ల విపరీతమైన ప్రేమను చూపిస్తారు'' అని చెప్పారు.

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ''నాగార్జున, పివిపి, కార్తిల నమ్మకమే ఈ సినిమా. దర్శకుడు, కెమెరామెన్ అనుకుంటే సినిమా అయిపోదు. గట్స్ ఉన్న నిర్మాత కావాలి. పివిపి గారు ఎంతో నమ్మకంతో సినిమా చేశారు. మోస్ట్ ఎక్స్ పెన్సివ్ ప్లేస్ అయిన పారిస్ లో సినిమాను చిత్రీకరించాం. ఏ లొకేషన్, ల్యాండ్ మార్క్ మిస్ అవ్వకుండా సినిమా చేశాం. మంచి జర్నీలా సినిమా మా జీవితాల్లో మిగిలిపోతుంది'' అని చెప్పారు.

నిర్మాత పివిపి మాట్లాడుతూ.. ''ఈ సినిమాను మార్చి 25న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. నాగార్జున కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది. రెండు భాషల్లో కలిపి సుమారుగా 50 కోట్ల రూపాయలతో బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించాం. పారిస్, న్యూయార్క్ తదితర ప్రాంతాల్లో షూట్ చేశాం. మంచి టెక్నీషియన్స్ తో కలిసి ఈ సినిమాను నిర్మించాను'' అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో అబ్బూరి రవి, హరి. బి.ఏ.రాజు తదితరులు పాల్గొన్నారు.

సంగీతం: గోపీసుందర్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్, ఎడిటింగ్: మధు, ఫైట్స్: కలోయిన్ ఒదెనిచరోవ్, కె.రవివర్మ, సిల్వ, డాన్స్: రాజు సుందరం, బృంద, స్టోరీ అడాప్షన్: వంశీ పైడిపల్లి, సాల్మన్, హరి, మాటలు: అబ్బూరి రవి, ప్రొడక్షన్ డిజైనర్: సునీల్ బాబు, సమర్పణ: పెరల్ వి.పొట్లూరి, నిర్మాతలు: పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement