Advertisementt

'గుప్పెడంత ప్రేమ' ట్రైలర్ లాంచ్!

Wed 09th Mar 2016 04:56 PM
guppedantha prema,vinod lingala,sai ronak,aditi singh  'గుప్పెడంత ప్రేమ' ట్రైలర్ లాంచ్!
'గుప్పెడంత ప్రేమ' ట్రైలర్ లాంచ్!
Advertisement
Ads by CJ

సాయి రోనక్, అదితి సింగ్ జంటగా ఐ వింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వం వహించిన చిత్రం 'గుప్పెడంత ప్రేమ'. ఈ చిత్రం ట్రైలర్ ను బుధవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో మధురాశ్రీధర్ రెడ్డి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా..

మధురా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ''వినోద్ నాకిష్టమైన అసోసియేట్ డైరెక్టర్. 'ఇట్స్ మై లవ్ స్టొరీ' సినిమాకు నాతో కలిసి వర్క్ చేశాడు. నా దగ్గర వర్క్ చేసిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళడం సంతోషాన్ని కలిగిస్తుంది. వినోద్ సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేస్తాడు. ట్రైలర్ చాలా బావుంది. అవుట్ అండ్ అవుట్ లవ్ స్టొరీ చేసినట్లు ఉన్నాడు. డైలాగ్స్ కూడా కొత్తగా ఉన్నాయి. ఈ సినిమా పెద్ద విజయం సాధించి వినోద్ ఇలానే మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ.. ''ఇట్స్ మై లవ్ స్టొరీ సినిమాలో నేను చిన్న క్యారెక్టర్ ప్లే చేశాను. అప్పుడు వినోద్ తో పరిచయం ఏర్పడింది. మంచి టైటిల్ తో సినిమా చేశాడు. ఫీల్ గుడ్ మూవీ. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్ కు తగ్గట్లుగా ఉంది. ప్రేమ కథకు ఎంటర్టైన్మెంట్ జోడించి తీశారు'' అని చెప్పారు. 

దర్శకుడు వినోద్ మాట్లాడుతూ.. ''గుప్పెడంత ప్రేమ కోసం మనిషి ఏదైనా చేస్తాడు. ఇదొక ప్యూర్ లవ్ స్టొరీ. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అవుతుంది. ఈ సినిమా నార్త్ ఈస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. మేఘాలయ, చిరపుంజి తదితర ప్రాంతాల్లో చిత్రీకరించాం. ప్రతి ఒక్కరు ఎంతగానో సపోట్ చేశారు. ఈ సినిమా కథ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. మ్యూజిక్ ఫ్రెష్ గా ఉంటుంది'' అని చెప్పారు.

నవనీత్ సుందర్ మాట్లాడుతూ.. ''గుప్పెడంత ప్రేమ ఆర్డినరీ లవ్ స్టొరీ కాదు. హానెస్ట్ ఫిలిం. సినిమా కథ వినగానే బాగా నచ్చింది. సినిమాలో మొత్తం 8 పాటలు ఉంటాయి. అందరికి స్టోరీ కనెక్ట్ అవుతుంది'' అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో సాయి రోనక్, అదితి సింగ్, నోయెల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి లిరిక్స్: వనమాలీ, శ్రీమణి, గణేష్, తిల్లు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పావని లింగాల, ఆర్ట్: రాజీవ్ నాయిర్, ఎడిటింగ్: బసవ పైడిరెడ్డి, సినిమాటోగ్రఫీ: సంజయ్ లోక్ నాథ్, మ్యూజిక్: నవనీత్ సుందర్, నిర్మాణం: ఐ వింక్ ప్రొడక్షన్స్, కథ-దర్శకత్వం: వినోద్ లింగాల.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ