Advertisementt

హీరో చ‌ర‌ణ్ తేజ్ బర్త్ డే సెలబ్రేషన్స్!

Wed 09th Mar 2016 01:46 PM
badram becarefuul brotheru,charan tej birthday celebrations  హీరో చ‌ర‌ణ్ తేజ్ బర్త్ డే సెలబ్రేషన్స్!
హీరో చ‌ర‌ణ్ తేజ్ బర్త్ డే సెలబ్రేషన్స్!
Advertisement
Ads by CJ

సంపూర్ణేష్ బాబు, చర‌ణ్ తేజ్ , రోష‌న్, హ‌మీదా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం 'భ‌ద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ'. రాజేష్ పులి డైర‌క్ట్ చేస్తున్న ఈ సినిమా మారుతి టీమ్ వ‌ర్క్స్ ప‌తాకంపై రూపొందుతుంది. మార్చి 8న చ‌ర‌ణ్ తేజ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చ‌ర‌ణ్ తేజ్ మాట్లాడుతూ... ''మాది గుంటూరు జిల్లా. రాజ‌మండ్రిలో పెరిగాను. అక్క‌డే సినిమాల పై ఆస‌క్తి ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత స్టడీ కోసం హైద‌రాబాద్ వ‌చ్చాను. ఒక‌వైపు స్ట‌డీ కొన‌సాగిస్తూనే సినిమాల ఉన్న ఇంట్ర‌స్ట్ తో చాలా సినిమాల‌కు స్క్రిప్టు విభాగంలో పనిచేశాను. ద‌ర్శ‌కుడు మారుతి, త్రినాధరావు నక్కిన ల దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేశాను. దర్శకునిగానే ఇండస్ట్రీలో ఎదగాలని భావించాను. మారుతి గారితో చాలా రోజులు ట్రావెల్ అయ్యాను. ఓ రోజు యాక్టింగ్ చేయొచ్చు క‌దా అన్నారు. కానీ నాకు పెద్దగా ఆస‌క్తి లేద‌ని చెప్పాను. మారుతి గారి ఎన్నో చిత్రాల‌కు ప‌ని చేసిన రాజేష్ పులి గారు, నాకిష్ట‌మైన సినిమాటోగ్రాఫ‌ర్ జోష్ గారు క‌లిసి భ‌ద్రం బి కేర్ ఫుల్ చేస్తున్న సినిమా కోసం న‌న్నున‌టించ‌మ‌ని అడిగారు. క‌థ న‌చ్చ‌డంతో కాదన‌లేక‌పోయాను. ఈ సినిమాలో షార్ట్ ఫిలిం మేకర్ గా కనిపిస్తాను. నేను సినిమాలో డైరెక్ట్ చేసే హీరో సంపూర్నేష్ బాబు. ద‌ర్శ‌కుడు రాజేష్ పులి గారు చెప్పిన‌ట్లుగా చేశాను. ఈ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి వి.వి వినాయ‌క్ గారితో చెప్పా. మంచి నిర్ణయం తీసుకున్నావు కాని చదువును అశ్రద్ధ చేయకు అన్నారు. ప్ర‌స్తుతం మెడిసిన్ థ‌ర్డ్ ఇయ‌ర్ చదువుతున్నా. ఇక మీద‌ట యాక్టింగ్ మీద దృష్టి పెడుతున్నా. మంచి డాక్టర్ ను అయ్యి ఉచితంగా పేద‌ల‌కు వైద్యం చేయాల‌న్న‌ది నా కోరిక. ఈ సినిమా న‌టుడుగా మంచి పేరు తెస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. సంపూర్ణేష్ బాబుకి నాకు మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు చాలా ఎంట‌ర్టైనింగ్ గా ఉంటాయి'' అని అన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ