స్నేహా చిత్ర పిక్చర్స్ బ్యానర్ పై ఆర్.నారాయణమూర్తి, విక్రమ్, ప్రసాద్ రెడ్డి, త్రినాద్ ప్రధాన పాత్రల్లో నారాయణమూర్తి దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం 'దండకారణ్యం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మర్చి 18న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..
ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. ''ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 18న విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రభుత్వం చేపట్టే గనులు, బాక్సైట్ తవ్వకాల వలన ఆదీవాసీయుల మనుగడ లేకుండా పోతుంది. పర్యావరణమంతా.. సర్వనాశనం అయిపోతుంది. రాజ్యాంగంలో ఆదీవాసీయుల హక్కులను ఉల్లంగించి ప్రభుత్వం ఈ పనులను చేపడుతుంది. వారి హక్కుల కోసం చర్చించే చిత్రమే ఈ దండకారణ్యం. మూల వనరులు మూలవాసీయులకే చెందాలి. విదేశీపాలు కాకూడదు. ఇటీవలే సినిమా ఆడియో విడుదలయింది. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సాహిత్యాన్ని అందించి పాటలు పాడిన ప్రజాకవులకు, గద్దర్ గారికి, వందేమాతం శ్రీనివాస్ కు నా కృతజ్ఞతలు. భారతదేశంలో లో సుమారుగా 12 రాష్ట్రాల్లో ఉన్న అడవులు నాశనమైపోతున్నాయి. ఉద్యమకారులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. దండకారణ్యంలో ఎలాంటి మారణహోమం జరగకుండా హోమాలు జరిపించాలి. నా గత చిత్రాల మాదిరి ఈ చిత్రాన్ని కూడా ఆదరించి నేను మరిన్ని చిత్రాలు చేయడానికి ప్రేక్షకులు దోహదపడతారని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
ఈ చిత్రానికి కెమెరా: శివకుమార్, ఆపరేటివ్ కెమెరామెన్: నాగేష్ బాబు, కథ,చిత్రానువాదం, మాటలు, ఎడిటింగ్, కోరియోగ్రఫీ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఆర్.నారాయణమూర్తి.