Advertisementt

రిలీజ్ కు రెడీ అవుతోన్న 'డార్లింగ్ 2'!

Thu 03rd Mar 2016 07:35 PM
darling movie,sathish chandra sekharan,kalaiyarasan  రిలీజ్ కు రెడీ అవుతోన్న 'డార్లింగ్ 2'!
రిలీజ్ కు రెడీ అవుతోన్న 'డార్లింగ్ 2'!
Advertisement
Ads by CJ

ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ కె.ఇ. జ్ఞాన‌వేల్ రాజా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తమిళ చిత్రం డార్లింగ్ 2. ఈ చిత్రాన్ని వరుణ్ చౌదరి సమర్పణలో ఎవర్ గ్రీన్ క్రియేషన్స్ బ్యానర్ పై తెలుగులో డార్లింగ్ 2 అనే పేరుతోనే విడుదల చేస్తున్నారు. కళైయరసన్, రమీజ్ రాజా, మాయ, కాళి వెంకట్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. సతీష్ చంద్రశ్రేఖరన్ దర్శకుడు. మాధురి బొల్లు నిర్మాత. సస్పెన్స్, థ్రిల్లర్, హర్రర్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోడానికి సిద్ధమైంది. దర్శకుడు సతీష్ చంద్రశేఖరన్ అతని ఐదుగురు స్నేహితలు హాలీడేలో జరిగిన ఘటనను బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మార్చి నెలలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

కళైయరసన్, రమీజ్ రాజా, మాయ, కాళి వెంకట్, హరి, అర్జునన్, రాందాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగతం: రథన్, మాటలు: రాజశేఖర్ రెడ్డి, పాటలు: శివగణేష్, సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కణ్ణన్, నిర్వహణ: మాధవి, సహ నిర్మాత: షషిత మైనేని, నిర్మాత: మాధురి బొల్లు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సతీష్ చంద్రశేఖరన్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ